- Advertisment -spot_img
HomeNEWSదేవాలయ అభివృద్ధిపై బురద జల్లడం తగదు

దేవాలయ అభివృద్ధిపై బురద జల్లడం తగదు

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి
  • 40 లక్షల ప్రొసీడింగ్స్ ఇప్పటికే అందజేసిన ఎమ్మెల్యే
  • స్థాయికి మించి విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం: భద్రేశ్వర ఆలయ మాజీ చైర్మన్ పటేల్ కిరణ్

జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరులోని భద్రేశ్వర ఆలయ ప్రాంగణ అభివృద్ధి, అన్నదాన సత్రం నిర్మాణంపై బిఆర్ఎస్ నాయకులు పటేల్ కరుణాకర్ కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆలయ మాజీ చైర్మన్ పటేల్ కిరణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పటేల్ కిరణ్ మాట్లాడుతూ …
తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నియోజకవర్గంలో అన్ని వర్గాల సంక్షేమానికి, దేవాలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆలయ అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యే ఇప్పటికే ₹40 లక్షల ప్రొసీడింగ్స్ మంజూరు చేశారని, త్వరలోనే మరో ₹20 లక్షల నిధులు అందజేస్తారని తెలిపారు. వీరశైవ సమాజానికి ఇచ్చిన మాట ప్రకారం ₹25 లక్షల నిధులు కూడా త్వరలోనే విడుదలవుతాయని స్పష్టం చేశారు.
దేవాలయంలో అన్నదాన సత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వల్ప వ్యవధిలోనే నిర్మించి అందుబాటులోకి తెచ్చామని, ఈ నిర్మాణంలో బసవరాజ్ సార్, వీరశైవ సమాజ నాయకులు, యువత, భజన మండలి సభ్యులు ఎంతో సహకరించారని గుర్తుచేశారు. భజన మండలి సభ్యులు ₹1,01,016 విరాళంగా ఇచ్చారని, సమాజం ద్వారా సేకరించిన నిధులన్నీ ఆలయ అభివృద్ధికి పారదర్శకంగా వినియోగించామని వివరించారు.
తేరు సామాగ్రి భద్రపరిచే షెడ్డు నిర్మాణానికి సంబంధించి నాయకుడు కోకల్ రవి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామని, ఆ పని కూడా త్వరలోనే పూర్తవుతుందన్నారు. ప్రచార ఆర్భాటాల కోసం స్థాయికి మించి మాట్లాడటం తగదని, కొంచెం ఓపిక పడితే ఎమ్మెల్యే నాయకత్వంలో అభివృద్ధి పనులన్నీ క్రమంగా పూర్తవుతాయని విమర్శకులకు హితవు పలికారు.

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments