- Advertisment -spot_img
HomeNEWSగణేష్ కమిటీకి రూ. 51,000 విరాళం..!

గణేష్ కమిటీకి రూ. 51,000 విరాళం..!

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి
  • గణేష్ ఉత్సవాలకు కౌన్సిలర్ కుమారుడి విరాళం
  • రూ. 51,000 విరాళమిచ్చిన అజాస్
  • కులమతాలకు అతితంగా పండగ జరుపుకోవాలని సూచన. ..!

జనవాహిని ప్రతినిధి తాండూరు; వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని మున్సిపల్ పరిధిలో భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో 25వ వార్డు కౌన్సిలర్ నాసిర్ భాను కుమారుడు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు     అజాస్ తన ఉదారతను చాటుకున్నారు.
వార్డులోని యువకులు శివాజీ చౌక్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవ కమిటీకి ఆయన తన వంతు సహకారంగా రూ. 51,000 నగదును చందా రూపంలో కమిటీ ప్రతినిధులకు శాలువాతో సత్కరించి అందజేశారు.
ఈ సందర్భంగా అజాస్ మాట్లాడుతూ… భక్తి భావంతో పాటు ప్రశాంత వాతావరణంలో, కులమతాలకు అతీతంగా గణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. యువకులు చేపడుతున్న ఇలాంటి సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మా కుటుంబం ఎల్లప్పుడూ పూర్తి మద్దతుగా ఉంటుందని తెలిపారు.
అనంతరం గణేష్ కమిటీ సభ్యులు మరియు వార్డు యువకులు కౌన్సిలర్ నాసిర్ భాను కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. యువతకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ముందుకు వచ్చిన అజాస్‌ను వార్డు ప్రజలు, మున్సిపల్ నాయకులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో గణేష్ కమిటీ ప్రతినిధులు, వార్డు నాయకులు, యువకులు కాలనీవాసులు పాల్గొన్నారు.

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments