- Advertisment -spot_img
HomeNEWSకోలాహలంగా పోలేర అమావాస్య..!

కోలాహలంగా పోలేర అమావాస్య..!

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి
  • తాండూరు పాతకుంట కట్ట మైసమ్మ ఆలయంలో పోలేర అమావాస్య
  • ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్

జనవాహిని ప్రతినిధి తాండూరు; పోలేర అమావాస్యను పురస్కరించుకొని తాండూరు పట్టణంలోని ఆదర్శనగర్ పాతకుంట ప్రాంతంలో కట్ట మైసమ్మ ఆలయంలో వేడుకలు శుక్రవారం జరిగాయి. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, ఆలయ గౌరవ అధ్యక్షులు విట్టల్ నాయక్ ఆలయానికి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారిని విశేషంగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని విట్టల్ నాయక్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పవిత్రమైన శ్రావణమాసం ముగింపు రోజైన పోలేర అమావాస్య నాడు శ్రీ కట్ట మైసమ్మ తల్లిని దర్శించుకోవడం ఎంతో విశేషమని పేర్కొన్నారు. అమ్మవారి దివ్య ఆశీస్సులు తాండూరు పట్టణ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆలయ సమగ్ర అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని హామీ ఇచ్చారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు, అసౌకర్యాలు కలగకుండా చూస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments