- Advertisment -spot_img
HomeNEWSఎమ్మెల్సీ ని సస్పెండ్ చేయ్యాలి...

ఎమ్మెల్సీ ని సస్పెండ్ చేయ్యాలి…

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి

_ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు
_ చర్యలు తీసుకోవాలని పిర్యాదు

జనవాహిని ప్రతినిధి తాండూరు: తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధు పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావాలి సంతోష్ డిమాండ్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో పార్టీ నాయకులతో కలిసి పిర్యాదు చేశారు. అసభ్య పదజాలం తో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ ను దుషించడం సరికాదని మండిపడ్డారు. వెంటనే భాహిరంగంగా తాతా మధు స్పీకర్ గడ్డం ప్రసాద్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోని క్షమపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే హోదాలో ఉండి అసభ్య పదజాలం తో దుశించిన తాతా మధు ను వెంటనే ఎమ్మెల్సీ పదవి నుండి సస్పెండ్ చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కావాలి సంతోష్, ఉర్దూఘర్ చైర్మన్ జలాల్, సుదర్శన్ గౌడ్, వెంకటేష్, బాలరాజు, జోగుల ఎబినైజర్ తదితరులు పాల్గొన్నారు.

జనవాహిణి డిజిటల్ పత్రిక • Universal ePaper Studio LIVE PRO
ఈ వార్తను పత్రిక శైలి ఈ-పేపర్‌గా మరియు వాట్సాప్ హెచ్‌డీ విజువల్ కార్డ్‌గా డౌన్‌లోడ్ చేయండి
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments