- తాండూరు ఎవక్యూ ప్రాపర్టీలో అక్రమ నిర్మాణాలు బంద్
- వెంటనే పనులు నిలిపివేయాలని నోటీసులు
- కోర్టు/అధికారులను ఆశ్రయించిన పిటిషనర్
- నకిలీ పత్రాలతో నిర్మాణాలు జరుపుతున్నారని స్థానికుల ఆరోపణలు
జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు పట్టణ నడిబొడ్డున ఉన్న వినాయక చౌక్ ప్రాంతంలోని ఎవక్యూ ప్రాపర్టీ వ్యవహారం మళ్లీ సంచలనంగా మారింది. సదరు స్థలంలో జరుగుతున్న నిర్మాణాన్ని అక్రమ నిర్మాణంగా పరిగణిస్తూ, పనులను వెంటనే నిలిపివేయాలని నోటీసులు జారీ ఐనట్లు విశ్వాసనీయ సమాచారం.
గత కొన్ని నెలలుగా ఈ స్థలంలో మున్సిపల్ లేదా ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే భారీ నిర్మాణాలు చేపడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఒక వ్యక్తి పేరుమీద ఉన్న నకిలీ పత్రాలను సృష్టించి, దొంగ కాగితాల ఆధారంగానే ఈ పనులను శరవేగంగా కొనసాగిస్తున్నారని స్థానికంగా తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. క్షేత్రస్థాయిలో అక్రమ కట్టడాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ క్రమంలోనే స్థానిక ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఈ అక్రమ నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నతాధికారులు/కోర్టులో పిటిషన్ దాఖలు వేసినట్లు సమాచారం. సదరు పిటిషన్‌ను విచారణకు స్వీకరించి ఎవక్యూ ప్రాపర్టీలో జరుగుతున్న పనులను తక్షణమే నిలిపివేయాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ అయినట్లుగా తెలుస్తుంది. ఈ వ్యవహారం తో తాండూరు లో మళ్ళీ ఎవక్యూ ప్రాపర్టీ చర్చల్లోకి వచ్చింది. ఈ విషయం పై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది ఆసక్తిగా మారింది.



