- నర్సింలుపై మాజీ సర్పంచ్ మిత్రూ నాయక్ ఆగ్రహం
- పోలీస్ స్టేషన్ ముందే బెదిరింపులకు దిగారంటూ ఆరోపణలు
- ఉన్నతాధికారులను కలిసి న్యాయపోరాటం చేస్తానని వెల్లడి
జనవాహిని ప్రతినిధి తాండూరు; మున్సిపల్ 10వ వార్డు లో ఓడిపోయిన కౌన్సిలర్ నర్సింహులు అహంకారంతో ప్రవర్తిస్తూ, తనతో పాటు స్థానిక విలేకరులను బెదిరింపులకు గురిచేస్తున్నారని మాజీ సర్పంచ్ మిత్రూ నాయక్ ఆరోపించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ….
ఇటీవల తాను వస్తున్న సమయంలో పోలీస్ స్టేషన్ ఎదుటే కావాలని నర్సింహులు నిలిపివేసి, ర్యాష్‌గా మాట్లాడుతూ నిన్ను చూసుకుంటా అని బెదిరించాడని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశానని, దీనిపై డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో న్యాయం జరగకపోతే జిల్లా ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేస్తానని, అతడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
స్థానిక ఓ విలేకరిని కూడా నర్సింలు బెదిరించాడని మిత్రూ నాయక్ ఆరోపించారు. ప్రజాసమస్యలు, వాస్తవాలను సమాజానికి తెలిపే మీడియా ప్రతినిధులను భయపెట్టడం సరికాదన్నారు.
నర్సింలు మరో వ్యక్తి తో కలిసి భయభ్రాంతులకు గురిచేసి 5 గుంటల భూమిని దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. సదరు భూమికి సంబంధించిన డబ్బులను లేదా భూమిని న్యాయంగా బాధితులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గుడి ప్రమాణాల ద్వారా నిజానిజాలు బయటపెడతానని హెచ్చరించారు.
గత ఎన్నికల్లో 10వ వార్డులో ఒక సాధారణ కుర్రాడి చేతిలో ఓడిపోయినా నర్సింలుకు బుద్ధి రాలేదన్నారు. తాండూరు మొత్తాన్ని ఏలేస్తానని, చైర్మన్ అవుతానని అహంకారంతో మాట్లాడినందుకే ప్రజలు, భగవంతుడు అతనికి తగిన శాస్తి చేశారు అని మిత్రూ నాయక్ స్పష్టం చేశారు.



