- ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
- తాండూరు నియోజకవర్గంలో 261 మందికి రూ. 1.50 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ
జనవాహిని ప్రతినిధి తాండూరు; ముఖ్యమంత్రి సహాయ నిధి కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, తీవ్ర అనారోగ్యంతో కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందించే కొండంత భరోసా అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు.
వివిధ రకాల తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన తాండూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన 261 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ. 1,50,00,000/- కోటి యాభై లక్షల రూపాయలు విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… నిరుపేదల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ఆపద సమయంలో సీఎంఆర్ఎఫ్ నిధులు బాధితులకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తున్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం ద్వారా సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.



