- వార్డులోని 4 ప్రాంతాలకు కొత్త పేర్లు ఖరారు
- మున్సిపల్ కౌన్సిల్లో ప్రతిపాదిత తీర్మానం ఆమోదం
జనవాహిని ప్రతినిధి తాండూరు;ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని తాండూర్ మున్సిపల్ వార్డు నెంబర్ 7 కౌన్సిలర్ షేక్ ఇర్షాద్ నెరవేర్చారు. తన పరిధిలోని నాలుగు ప్రధాన ప్రాంతాలకు ప్రత్యేక పేర్లు నామకరణం చేస్తానన్న మాట మేరకు, బుధవారం నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో అధికారికంగా తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు.
హుస్సేన్ నగర్, కోకిల కాటేజ్,సుప్రీం కాలనీ, విలేమూన్ చౌరస్తా గా నామకరణం చేశారు.
వార్డులోని సమస్యలు, అవసరాలను గుర్తించి ఇచ్చిన హామీని అధికారిక తీర్మానం ద్వారా అమలు దిశగా ముందుకు తీసుకెళ్లడం పట్ల వార్డు నెంబర్ 7 ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ ఇర్షాద్ మాట్లాడుతూ… “ప్రజలకు ఇచ్చిన మాటే నాకు అత్యంత ముఖ్యంమన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ప్రతి అంశాన్ని దశలవారీగా నెరవేర్చి, వార్డును మోడల్ వార్డుగా తీర్చిదిద్దడమే లక్ష్యం అని తెలిపారు.



