Dadi Veerabhadra Rao : ఎన్నికల ముందు వైసీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇటీవల మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి… వైసీపీకి రాజీనామా చేశారు. తాజాగా వైసీపీకి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు. మంగళవారం తన ముఖ్య అనుచరులతో సమావేశమైన దాడి వీరభద్రరావు…అనంతరం తన రాజీనామా లేఖను సీఎం జగన్ పంపించారు. తన అనుచరులతో కలిసి వైసీపీని వీడుతున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. సీఎం జగన్ తో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డికి వీరభద్రరావు రాజీనామా లేఖను పంపించారు. అయితే తన రాజీనామాకు ముందు అనకాపల్లిలో వీరభద్రరావు తన అనుచరులతో సమావేశమయ్యారు. పార్టీలో తగిన ప్రాధాన్యత లేదని వారితో ఆయన అన్నట్లు సమాచారం. త్వరలోనే రాజకీయ భవిష్యత్తుపై ప్రకటన చేస్తానన్నారు. ఏ పార్టీలో చేరేది త్వరలోనే చెబుతామని దాడి వీరభద్రరావు అన్నారు.