వేటు తప్పదు ..సమ్మె ఆగదు

తెలంగాణాలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు విధుల్లోకి రాక పోవడంతో లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పర్సితిథి కొలిక్కి రాక పోవడంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, రాష్ట్ర పోలీసు శాఖతో పాటు హైదరాబాద్ నగర పాలక సంస్థ, మెట్రో సర్వీసులను, ప్రైవేట్ ఆపరేటర్లతో బస్సులు, రైళ్లు నడిపారు. కొత్తగా డ్రైవర్లు, కండక్టర్లను నియమించారు. అయినా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. 56 వేల మంది కార్మికులు, సిబ్బంది అంతా మూకుమ్మడిగా సమ్మెలో పాల్గొన్నారు. మొదటి రోజు విధుల్లోకి చేరలేదు. రెండో రోజు అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికులు వారి కుటుంబాలతో కలిసి బతుకమ్మలు ఆడారు. సీఎం కేసీఆర్ కరుణించాలని కోరారు. ఆర్టీసీ సంస్థ, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డెడ్ లైన్ విధించారు.

అయినా కార్మికులు ఒప్పుకోలేదు. తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చే దాకా విధుల్లోకి చేరబోమంటూ స్పష్టం చేశారు. అంతకు ముందు సీఎం ముగ్గురితో కమిటీ వేసినా ఫలితం లేక పోయింది. దానిని కూడా రద్దు చేశారు. కొన్ని చోట్ల ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం మాత్రం అలాంటిది ఏమీ లేదని స్పష్టం చేసింది. కొత్తవారిని తీసుకున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. విధుల్లో చేరని వారిని ఇక నుంచి ఉద్యోగులుగా పరిగణించబోమని తెలిపారు. హైకోర్టు త్వరగా సమస్యను పరిష్కరించాలని కోరింది. బెదిరింపులకు తలొగ్గే ప్రసక్తి లేదని యూనియన్ నేతలు తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులను తొలగిస్తూ సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంపై భగ్గుమన్నారు.

ఆర్టీసీ కార్మికులు మీ ఇంట్లో పనిచేసే పాలేర్లు కాదని గుర్తుంచుకోండి.. తెలంగాణ మీ గులాంగిరి కాదు.. జాగీరు కాదు’ అని సీఎంను హెచ్చరించారు. కార్మికులను డిస్మిస్‌ చేసి.. కొత్త వాళ్లను భర్తీ చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. కొత్తగా చేరే వాళ్లకూ ఏ యూనియన్‌లోనూ చేరవద్దనే షరతు పెట్టడం కేసీఆర్‌ నియంతృత్వ వైఖరికి నిదర్శనమన్నారు. అలాంటప్పుడు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు మాత్రం ఎందుకని నిలదీశారు. తక్షణం తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రాన్ని కోరారు. ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులను కేసీఆర్‌ వాడుకుని ఇప్పుడు వదిలి వేశారని ధ్వజమెత్తారు. సీఎం కన్ను ఆర్టీసీ ఆస్తులపై పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అందుకే ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని అశ్వత్థామ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ కొన్ని కార్పొరేట్‌ కంపెనీలతో కలిసి ఆర్టీసీని అమ్మేయడానికి సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. ఇప్పటికే కొన్ని డీజిల్‌ బంక్‌లు కేసీఆర్‌ సన్నిహితుల పరం అయ్యాయని ఆరోపించారు. సంస్థ కార్మికులంతా త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. చరిత్రలో నియంతలకు పట్టిన గతే.. కేసీఆర్‌కూ పడుతుందని గుర్తుంచు కోవాలని హితవు పలికారు. మొత్తం మీద ప్రభుత్వం వర్సెస్ ఆర్టీసీ జేఏసీ మధ్య ఆధిపత్య పోరులో ఎవరు నిలుస్తారో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి. అంత దాకా ప్రయాణ కస్టాలు తప్పేలా లేవు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

దిగ్గజ నేతలు..కలిసిన కత్తులు

Fri Oct 11 , 2019
Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email Pin it http://www.janavahinitv.com/2019/10/%e0%b0%b5%e0%b1%87%e0%b0%9f%e0%b1%81-%e0%b0%a4%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%a6%e0%b1%81-%e0%b0%b8%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b1%86-%e0%b0%86%e0%b0%97%e0%b0%a6%e0%b1%81/#MjMtMzAweDIyNS5 ప్రపంచం ఎంతో అతృతతో ఎదురు చూసే క్షణాలు రానే వచ్చాయి. అభివృద్ధిలో దూసుకు వెళుతున్న ఇండియా, చైనా దేశాధినేతలు చెన్నైలోని మహాబలిపురం లో కలుసుకున్నారు. అంతకు ముందు చైనా అధినేత జిన్ పింగ్ కు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో తమిళనాడు ప్రభుత్వం స్వాగతం పలికింది. అడుగడుగునా […]