విరాట్ విశ్వరూపం

టీమిండియా సారథి మరోసారి తన ప్రతాపాన్ని చూపించాడు. స్వదేశంలో సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీ డబుల్ సెంచరీ చేసి తనకు తిరుగు లేదని చాటాడు. ఇండియా మొదటి ఇన్నింగ్ ను అయిదు వికెట్లు కోల్పోయి 601 పరుగుల వద్ద ముగిస్తున్నట్లు కోహ్లీ ప్రకటించాడు. దీంతో సౌత్ ఆఫ్రికా భారీగా పరులుఁగు చేయాల్సి ఉంది. మొదటి రోజు మయాంక్ అగర్వాల్ సెంచరీతో కదం తొక్కితే రెండో రోజు ఆటలో విరాట్ పరుగుల వరద పారించాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. విరాట్ తన రికార్డులను తానే అధిగమించాడు. 198 పరుగుల వద్ద ఈ సారథి 7000 పరుగులు పూర్తి చేశాడు.

336 బంతులు ఎదుర్కున్న కోహ్లీ 33 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 254 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. జట్టు భారీ స్కోర్ లో కీలక పాత్ర పోషించాడు. టెస్టుల్లో అత్యధిక మైలు రాయిని చేరుకున్నాడు. ఇండియా జట్టు తరపున సారథుల్లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడు కోహ్లీ ఒక్కడే. ఇది కూడా ఓ రికార్డ్. రహానే స్థానంలో మైదానం లోకి దిగిన రవీంద్ర జడేజా కోహ్లీకి సపోర్ట్ గా ఉన్నాడు. అతను 104 బంతులు ఎదుర్కొని 91 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది ఫోర్లు , రెండు సిక్సర్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా కోహ్లీ నేతృత్వంలో టీమిండియా 600 పరుగులను పది సార్లు చేయడం విశేషం.

విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. మాజీ సారథి గంగూలీ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విట్టర్ వేదికగా తెలిపింది. దాదా నేతృత్వంలో 2000 నుంచి 2005 సంవత్సరాల కాలంలో టీమిండియా 49 టెస్టులు ఆడింది. ఇప్పుడు పూణే వేదికగా జరుగుతున్న టెస్టులో ఈ రికార్డ్ బద్దలైంది. కోహ్లీకి ఈ మ్యాచ్ 50 వ మ్యాచ్. ఇదిలా ఉండగా 2008 నుంచి 2014 వరకు మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో టీమిండియా 60 టెస్ట్ మ్యాచులు ఆడింది. ప్రస్తుతం దాదాకు చెక్ పెట్టిన కోహ్లీ రాబోయే రోజుల్లో మరో 10 టెస్ట్ మ్యాచులు ఆడితే ఇక ఎమ్మెస్కె ధోని రికార్డ్ బద్దలవడం ఖాయం. భారత దేశం నిన్ను చూసి గర్విస్తోంది. ఇందుకు మేము సైతం సంతోష పడుతున్నామంటూ బీసీసీఐ వెల్లడించింది. అవును కదూ.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ తో చెత్త అనుభవం.. ట్విట్టర్లో విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ మండిపాటు

Tue Nov 5 , 2019
Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email Pin it http://www.janavahinitv.com/2019/10/%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b0%e0%b0%be%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b5%e0%b0%b0%e0%b1%82%e0%b0%aa%e0%b0%82/#ODExOTc2MDRfZ2F కన్ఫర్మ్ టికెట్ ఉన్నావిమానం ఎక్కడానికి అనుమతించడంలేదంటూ ఆవేదన క్షమించండంటూ క్రిస్ ఎమిరేట్ సంస్థ బదులు ట్వీట్ బుకింగ్ రిఫరెన్స్ తెలిపితే దర్యాప్తు చే్స్తామన్న ఎమిరేట్స్   ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ పై విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ మండిపడ్డాడు. కన్ఫర్మ్ టికెట్ ఉన్నా.. విమానంలో ఎక్కడానికి అనుమతించడంలేదని […]