నో కాంప్రమైజ్ – తేల్చి చెప్పిన కేసీఆర్

నిన్నటి దాకా డెడ్ లైన్ ముగియడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో, అధినేత కేసీఆర్ నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుందోనని ఎదురు చూసిన ఆర్టీసీ కార్మికులకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో సిబ్బందిని తీసుకోబోమని స్పష్టం చేశారు. యూనియన్ నాయకులతో, సిబ్బందితో ఎలాంటి చర్చలు ఉండబోవన్నారు. ప్రగతి భావం లో ఆర్టీసీ సమ్మెపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు సీఎం. ఆర్టీసీ నడిపే బస్సుల్లో సగం ప్రైవేట్ వాహనాలు ఉంటాయి. మిగతా వాహనాలు ఆర్టీసీకి చెందినవారి ఉంటాయి. ఇదే పద్దతిలో బస్సులు నడిపితే కొంత మేరకు నష్టాలు తగ్గే అవకాశం ఉంటుంది. తిరిగి సంస్థ నష్టాల నుండి గట్టెక్కే వీలు కుదురుతుంది.

బెంగాల్ , కేరళ , భారతీయ జనతా పార్టీ అధికారం లో ఉన్న రాష్ట్రాలలో ఆర్టీసీని ప్రభుత్వ పరం చేశారా అంటూ సీఎం ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోబోమంటూ తేల్చి చెప్పారు. ఇప్పుడు గొంతు చించుకుంటున్న విపక్ష పార్టీలకు అడిగే హక్కు లేదన్నారు. కార్మికులు సమ్మెకు దిగడం చట్ట విరుద్ధం. పండుగ వేళ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా చేయడం భావ్యం కాదన్నారు. ప్రజలంతా ఆర్టీసీ సిబ్బందిపై కోపంగా ఉన్నారని కేసీఆర్ చెప్పారు. తక్షణమే ఆర్టేసిలో కొత్తగా నియామకాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం విధించిన గడువు లోపు విధుల్లోకి రాక పోతే కొత్త వారిని తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం 1200 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు.

సిబ్బంది చేస్తున్నది తీవ్ర తప్పిదమని, ప్రభుత్వంతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో త్వరలో తెలుస్తుందన్నారు. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఆర్టీసీ సిబ్బందితో, యూనియన్ నాయకులతో చర్చలు జరుపబోమని కేసీఆర్ అన్నారు. ఏయే కేటగిరీలలో పని చేస్తున్నారో, ఎవరైతే సమ్మెలో పాల్గొంటున్నారో వారిని అధికారులు గుర్తించి తీసి వేస్తారు. ఇక వారు ఆర్టీసీ ఉద్యోగులు కారన్నారు. కొత్త వారిని తీసుకోవాలి, వారితో ఏ ఆర్టీసీ సంఘాలలో చేరబోమంటూ వారితో సంతకాలు చేయించు కోవాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. షరతులతో కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలన్నారు. హైదరాబాద్ నగరానికి చెందినంత వరకు నష్టాలను ప్రభుత్వం భరిస్తుందన్నారు. దాదాపు 5 గంటలకు పైగా సమావేశం జరిగింది. సంఘాలు చేసే బ్లాక్ మెయిలింగ్ కు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ జేఏసీ నేతలు మాత్రం సమ్మెను కొనసాగిస్తామని చెప్పారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

తెలంగాణం పూలవనం..వెల్లివిరిసిన మహిళా చైతన్యం

Mon Oct 7 , 2019
Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email Pin it http://www.janavahinitv.com/2019/10/%e0%b0%a8%e0%b1%8b-%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae%e0%b1%88%e0%b0%9c%e0%b1%8d-%e0%b0%a4%e0%b1%87%e0%b0%b2%e0%b1%8d%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%9a%e0%b1%86/#MDYtMzAweDIwMC5 తొమ్మిది రోజుల పాటు సాగిన బతుకమ్మ ఉత్సవం సద్దుల బతుకమ్మతో ముగిసింది. తెలంగాణ మొత్తం పూలవనంలా మారి పోయింది. లక్షలాది మంది మహిళలు బతుకమ్మలతో ఈ పండుగలో పాల్గొన్నారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సంబురాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నభూతో నభవిష్యత్తు అన్న రీతిలో సాగాయి. భారీగా […]