అందాల ఆరబోత..గుండెల్లో గిలిగింత

ఇంటిల్లిపాది కలిసి చూసే సినిమాలు చూద్దామన్నా అగుపించడం లేదు. మొత్తం సినిమాల్లో ద్వందార్థాలు, జుగుస్సాకరమైన సన్నివేశాలు ఎక్కువై పోయాయి. ఇంటర్నెట్ వినియోగం అందుబాటులోకి రావడం, కోట్లాది ప్రజలకు ఉచితంగా డేటా లభిస్తుండడంతో జనం వినోదానికి అలవాటు పడ్డారు. ప్రతి రోజు మొబైల్స్ కు బానిసలై పోయారు. కనెక్టివిటీ పెరిగాక బూతు మరింత ఎక్కువై పోయింది. గూగుల్ సెర్చింగ్ లో ఎక్కువగా దీని గురించే సెర్చింగ్ చేస్తున్నారని దిగ్గజ కంపెనీ తెలిపింది. పాకిస్తాన్ ముందంజలో వుంటే మనం దాని వెనకే ఉండడం విస్తు పోయేలా చేసింది. తక్కువ పెట్టుబడితో ఇటీవలే విడుదలైన పరుశురాం డైరెక్షన్ లో వచ్చిన గీత గోవిందం భారీ సక్సెస్ ను స్వంతం చేసుకుంది.

ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందాన పోటీపడి నటించారు. ఈ మూవీలో ముద్దు సీన్ ఎక్కువగా ఆకట్టుకుంది. అలాగే ఆర్ ఎక్స్ 100 సినిమా ఊహించని రీతిలో సక్సెస్ అయ్యింది. ఇందులో నటి పాయల్ రాజపుత్ కు ఎక్కువ మార్కులు పడ్డాయి. ఆమె అందాల ఆరబోత కుర్రకారును, ఇతరులను మెస్మరైజ్ చేసింది. దీంతో ఆమె నటించిన మరో సినిమా ఆర్దీఎక్స్ లవ్ పేరుతో మూవీ విడుదలైంది. రిలీజ్ కంటే ముందే సినిమా కు ఎక్కువ పబ్లిసిటీ లభించింది. ఈ సినిమాలోనూ పాయల్ రాజపుత్ తన అందాలను ఆరబోసింది. సినిమా ట్రైలర్ కు భారీ స్పందన వచ్చింది.

పోస్టర్స్ మాత్రం చూడలేని రీతిలో ఉన్నాయి. దీనిపై సినిమా ప్రేమికులు అభ్యంతరం చెబుతున్నారు. సినిమాలో పాయల్ తో పాటు తేజస్ నటించగా సంగీతం ఆకట్టుకునేలా ఉంది. పరశురామ్ డైలాగ్స్ రాస్తే శంకర్ భాను దర్శకత్వం వహించగా ..సి.కళ్యాణ్ నిర్మించారు. మొత్తం మీద సంగీతం, మాటలు బాగున్నా అందాల ఆరబోత ఏమేరకు సినిమాను గట్టెక్కిస్తుందో వేచి చూడాలి. ఇదిలా ఉండగా చాప కింద నీరులా ఎవ్వరికీ చెప్పొద్దూ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మెలమెల్లగా డబ్బులు వచ్చేలా ఉందని సినిమా వర్గాలు అంటున్నాయి. ఆరబోత ఒక్కటే సినిమాను గట్టెక్కిస్తుందని అనుకోవడం మాను కోవాలి.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

విరాట్ విశ్వరూపం

Fri Oct 11 , 2019
Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email Pin it http://www.janavahinitv.com/2019/10/%e0%b0%85%e0%b0%82%e0%b0%a6%e0%b0%be%e0%b0%b2-%e0%b0%86%e0%b0%b0%e0%b0%ac%e0%b1%8b%e0%b0%a4-%e0%b0%97%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b1%86%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%97%e0%b0%bf/#S09ITEkxLTMwMHg టీమిండియా సారథి మరోసారి తన ప్రతాపాన్ని చూపించాడు. స్వదేశంలో సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీ డబుల్ సెంచరీ చేసి తనకు తిరుగు లేదని చాటాడు. ఇండియా మొదటి ఇన్నింగ్ ను అయిదు వికెట్లు కోల్పోయి 601 పరుగుల వద్ద ముగిస్తున్నట్లు కోహ్లీ ప్రకటించాడు. […]