వారెవ్వా..అజ్జూ భాయ్..ఆగాయా..!

ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు కళ్ళ ముందు ఓ సంపూర్ణ విజయం సాక్షాత్కారమైంది. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే అన్న సినీ కవి రాసిన పాట మదిలో మెదిలింది. కభీ కభీ మేరే దిల్ మే అంటూ ముఖేష్, లతా ఆలాపిస్తూ ఉంటే అమితాబ్ భావోద్వేగంతో అలవోకగా చెబుతూ వుంటే ఆ ఆనందమే వేరు. ఏంటీ ఓ ప్రపంచాన్ని మరో సారి చుట్టి వచ్చినంత ఆనందం కలిగింది. ఎందుకంటే ఎవరెస్టు శిఖరం ఎక్కిన వాడు. ఎత్తు పల్లాలను చవి చూసిన వాడు. భారత జట్టులో బాంబే ఆధిపత్యాన్ని అడ్డుకున్నవాడు. టీమిండియాలో దేశంలోని నలుమూల నుండి ప్రాతినిధ్యం వహించేలా చేసిన వాడు. క్రికెట్లో అసాధ్యమనుకున్న మూడు సెంచరీలు సాధించి చరిత్ర సృష్టించిన వాడు. ఏకంగా ప్రపంచంలోనే భారత దేశపు జాతీయ పతాకాన్ని ప్రతి స్టేడియంలో ఎగిరేసేలా చేసిన అరుదైన ఆటగాడు..ఒకే ఒక్కడు..మణికట్టు మాయాజాలంతో ఇప్పటికే ఎప్పటికీ తన లాగా ఆడే ఆటగాల్లో కోసం వేచి చూస్తూ ఉన్న మాజీ క్రికెటర్ మహమ్మద్ అజహరుద్దీన్.
 
మ్యాచ్ ఫిక్సింగ్ భూతం అతడిని కమ్ముకోక పోయి వుంటే ఇవ్వాళ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కు చైర్మన్ అయ్యేవాడు. ఎన్ని వైఫల్యాలు ..ఎన్ని కుట్రలు..ఎన్ని అవమానాలు ..లోకం అతడిని వేలి వేసింది. తనవారు అతడిని దగ్గరికి రానివ్వలేదు. ప్రాణంగా ప్రేమించే కొడుకును పోగొట్టుకున్నాడు. ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఈ ఆటగాడు ఆడితే ..మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. గుండెల్లో పదిలంగా దాచు కోవాలనిపిస్తుంది. అలవోకగా, స్మూత్ గా ..పొలంలో వరినాట్లు వేసినట్లు అనిపిస్తుంది. ప్రాణం తీసే స్పీడ్ తో మైదానంలో మిస్సైల్స్ కంటే ప్రమాదకరంగా వచ్చే బంతుల్ని అలవోకగా పరుగులు తీసిన ఒకే ఒక్క క్రికెటర్ ఈ ఆటగాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో బుల్లెట్ల లాగా బౌలర్లు బౌలింగ్ చేస్తుంటే ఆటగాళ్లు ఒకొక్కరే పెవిలియన్ దారి పడితే, ఒక్కడే ఒంటరిగా నిలుచుని కేవలం తక్కువ బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఈ హైదరాబాదీ రిస్టీ ప్లేయర్ ను ఎలా మరిచి పోగలం.
 
వరల్డ్ వైడ్ గా ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ బౌలింగ్ చూసి భయపడితే మనోడు మాత్రం ఎలాంటి రిస్క్ తీసుకోకుండానే సిక్సర్లు కొట్టిన ఈ క్రికెటర్ ను ఎలా గుర్తుకు తెచ్చుకోకుండా ఉండగలం. ఒక స్థాయికి చేరుకున్న ప్రతి ఆటగాడి లో కొన్ని బలహీనతలు ఉంటాయి. అలా అని వారి ఆటను విస్మరించలేం. ఈడెన్ గార్డెన్ లో శ్రీలంక తో జరిగిన ఆసియా కప్ ఫైనల్ లో అజ్జూ భాయ్ చెలరేగిన తీరు ఒక్కసారి యూట్యూబ్ లో చూస్తే తెలుస్తుంది. ఆటంటే అది ..క్రికెట్ ఆట లో ఎన్ని ఫార్మాట్స్ ఉన్నాయో అన్నిట్లో తన ప్రతిభా పాటవాన్ని ప్రదర్శించిన ఒకే ఒక్క ప్లేయర్ మనోడు. ఆటనే ఆడని వాళ్ళు హెచ్ సి ఏ కు ప్రెసిడెంట్ గా వుంటే ఎలా. ఏ స్టేడియం లో తాను ఆడాడో అక్కడ లోపలి రానివ్వకుండా అవమానించారు. కానీ అజ్జూ భాయ్ వెనక్కి తగ్గలేదు. ఫీనిక్స్ పక్షి లాగా తిరిగి తానేమిటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే టీఆరెఎస్ పూర్తిగా అజ్జూ భాయ్ కు సపోర్ట్ ఇచ్చినట్టు వార్తలు గుప్పుమన్నాయి. మొత్తం మీద పదేళ్ల తర్వాత అజహరుద్దీన్ రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టడంతో క్రికెట్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

హెచ్‌సీఏ ఎన్నికల్లో అజ్జూ ప్యానల్ దే హవా

Sat Sep 28 , 2019
Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email Pin it http://www.janavahinitv.com/2019/09/blog-post_910/#QUpKVVBBTkFMLmp టీమిండియా మాజీ సారథి మహ్మద్‌ అజహరుద్దీన్‌.. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో ప్రత్యర్థులను చిత్తు చేశారు. అధ్యక్షుడిగా ఆయన విజయం సాధించడమే కాకుండా తన ప్యానల్‌ను కూడా గెలిపించుకున్నారు. హెచ్‌సీఏ చరిత్రలో ఒకే ప్యానెల్ అన్ని స్థానాలు కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. మాజీ […]