దుమ్ము రేపుతున్న సిద్ శ్రీరామ్ సాంగ్

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో త్వరలో రాబోతున్న బన్నీ నటించిన అల వైకుంఠపురంలో సినిమా లోని సాంగ్ విడుదలైన కొద్దీ సేపు లోపే మిలియన్స్ వ్యూస్ దాటేసింది. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి సామజవరగమణ పేరుతో పాటను రాయగా, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ దీనికి మ్యూజిక్ అందించాడు. అంతకు ముందు థమన్ జూనియర్ ఎన్ఠీఆర్ తో త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన అరవింద సామెత సినిమాకు కూడా క్యాచీ ట్యూన్స్ ఇచ్చాడు. అజ్ఞాతవాసి మూవీ అనుకున్నంతగా ఆడలేదు. ఇప్పుడు కసితో బన్నీతో మూడో సినిమా తీస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. హై పీచ్ లో సాగే ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. వేలాది మంది దీనిని చూస్తున్నారు. వింటున్నారు. తెలుగు సినీవాలిలో వేలాది పాటలు రాసిన చరిత్ర సిరివెన్నెలకు ఉన్నది.

మరోసారి అయన కలం జూలు విదిల్చింది. దుమ్ము రేపుతోంది. అత్యంత భావోద్వేగంతో సాగిన ఈ సాంగ్ జనాన్ని మెస్మరైజ్ చేస్తోంది. దీనికి సిద్ శ్రీరామ్ ప్రాణం పోశాడు. 19 మే 1990 లో చెన్నైలో శ్రీరామ్ పుట్టాడు. కంపోసర్ గా, మ్యూజిక్ ప్రొడ్యూసర్ గా, ప్లే బ్యాక్ సింగర్ గా, పాటల రచయిత గా ఇప్పటికే పేరు తెచ్చుకున్నాడు ఈ కుర్రాడు. మొదటగా ఇతడి గొంతులోని మాధుర్యాన్ని రెహమాన్ గుర్తించి పాడేందుకు ఛాన్స్ ఇచ్చాడు. తమిళ్, తెలుగు, మలయాళం సినిమాల్లో పాటలు పాడాడు సిద్ శ్రీరామ్. శ్రీరామ్ చెల్లెలు పల్లవి శ్రీరామ్ కళాకారిణిగా పేరు తెచ్చుకున్నారు. సంగీతంలోని మెళకువలను తల్లి లతా శ్రీరామ్ నుంచి సిద్ నేర్చుకున్నారు. సాన్ ఫ్రాన్సిస్కో లోనే ట్రైనింగ్ తీసుకున్నాడు. వీలున్నప్పుడల్లా ఇండియాకు వచ్చేవాడు. ఇక్కడ జరిగే సంగీత ఉత్సవాలలో పాల్గొంటూ వచ్చాడు. 2013 లో కాదల్ సినిమాకు మొదటి సారిగా రెహమాన్ మ్యూజిక్ లో అడియే సాంగ్ పాడాడు సిద్ శ్రీరామ్.

2015 లో ఎన్నోడు నీ ఇరున్తాల్ కోసం బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ అవార్డు దక్కింది. వానం కోట్ఠాతుం సినిమాకు కంపోసింగ్ చేశాడు శ్రీరామ్. పలు తమిళ్ సినిమాల్లో పాటలు పాడాడు. తెలుగులో  నువ్వుంటే నా జతగా , సాహసం శ్వాసగా సాగిపో, వెళ్ళిపోమాకే, మనసుకే సినిమాల్లో సిద్ పాడాడు. అదిరింది , గీత గోవిందం సినిమా హిట్ గా నిలిచింది. ఇంకేం ఇంకేం కావాలే, వచ్చిందమ్మ అంటూ పాడిన పాటలు ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ గా నిలిచాయి. 2018 లో ఈ సినిమా తో  పాటు సాంగ్స్ కూడా బిగ్గెస్ట్ హిట్ గా రికార్డ్ బ్రేక్ చేశాయి. దీంతో పాటు వదినమ్మ, నీవెవరో, వెన్నెలా వెన్నెలా శైలజ రెడ్డి అల్లుడు, దేవదాస్, ఉండి పోరాదే, టాక్సీవాలా లో మాటే విన దుగా, పడి పడి లేచే మనసు , సర్కార్ , ఫలకునామ దాస్, డియర్ కామ్రేడ్, రాక్షషుడు, గ్యాంగ్ లీడర్ , తోట తదితర తెలుగు సినిమాలలో శ్రీరామ్ పాడాడు..మెప్పించాడు. వీటితో పాటు మలయాళం లో కూడా తన టాలెంట్ తో హిట్ సాంగ్స్ కు ప్రాణం పోశాడు. ఇప్పుడు అలవైకుంఠపురంలోని సాంగ్ తో సైఅంటూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఓ మహాత్మా ..ఓ మహర్షి..బాపూ మనందరికీ వెలుగు

Sat Sep 28 , 2019
Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email Pin it http://www.janavahinitv.com/2019/09/blog-post_834/#R0FOREkuanBn నా జీవితమే నా సందేశం..అంటూ చెప్పడమే కాదు ఆచరణలో చేసి చూపించిన జాతిపిత. మహోన్నత మానవుడు. అహింసపై శాంతి అనే ఆయుధంతో కొన్ని తరాలుగా ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నారు. ఉంటారు కూడా. ఆంగ్లేయుల కబంధ హస్తాల్లో ఉన్న భారత దేశానికి స్వేచ్ఛను ప్రసాదించిన నాయకుడు. […]