ఓ మహాత్మా ..ఓ మహర్షి..బాపూ మనందరికీ వెలుగు

నా జీవితమే నా సందేశం..అంటూ చెప్పడమే కాదు ఆచరణలో చేసి చూపించిన జాతిపిత. మహోన్నత మానవుడు. అహింసపై శాంతి అనే ఆయుధంతో కొన్ని తరాలుగా ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నారు. ఉంటారు కూడా. ఆంగ్లేయుల కబంధ హస్తాల్లో ఉన్న భారత దేశానికి స్వేచ్ఛను ప్రసాదించిన నాయకుడు. మోహన్ దాస్ కరం చంద్ గాంధీ ..బారిస్టర్ కోసం లండన్ కు వెళ్లిన ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. హింసకు తావులేకుండా లక్షలాది మందిని ఏకం చేశాడు. తాను ఏది చెప్పాడో అదే ఆచరించి చూపాడు. తన పని తాను స్వంతంగా చేసు కోవడం, చని పోయేంత వరకు అబద్దం ఆడక పోవడం, సత్యాన్నే పలకడం, పెద్దలను, గురువులను గౌరవించడం. ప్రతి రోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయడం. మంచి పుస్తకాలు చదవడం మహాత్ముని దినచర్య.
 
ఈ దేశం ..ఈ జాతి ఆ మహాత్ముడిని ప్రతి రోజు తల్చుకుంటూనే ఉంటుంది. ఆయన పుట్టిన రోజును మనందరం పండుగలా జరుపుకుంటాము. 20 వ శతాబ్దంలో గాంధీజీ తప్ప ఇంకే నాయకుడు ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేయలేదు. ప్రతి దేశంలో ఆ గాంధీజీ విగ్రహం ఉండే ఉంటుంది. ఆయన బతికినంత కాలం హింస ను వ్యతిరేకించాడు. తోటి వారిని ప్రేమించాలని, కష్టాలలో ఉన్న వారిని ఆదు కోవాలని కోరారు. గాంధీజీని ఎక్కువగా ప్రభావితం చేసింది భగవత్ గీత. ఆయన ప్రతి రోజు దానిని చదివే వారు. తన అనుభవాల గురించి ఆత్మ కథ రాశారు. అది సత్య శోధన పేరుతో ప్రచురితమైంది. కోట్లల్లో పుస్తకాలు అమ్ముడు పోయాయి. వేలాది మందిని ప్రభావితం చేసింది ఆ పుస్తకం. దేశమంతటా గాంధీ పర్యటించాడు. స్వేచ్ఛ కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయాలని పిలుపు ఇచ్చారు. మానవులంతా సమానులే .
 
అందరి రక్తం ఒక్కటే. ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం వల్ల సమాజం చెడి పోతుంది. ప్రేమ ఒక్కటే కావాలి. అదే మనందరినీ కాపాడుతుంది. సత్యం నిలుస్తుంది. ధర్మం కోసం పాటు పడాలి. ఆ మహాత్ముడు చెప్పిన ప్రతి మాట వేలాది మందిని నాయకులుగా మార్చి వేసింది. ఇది ఆయన ఘనత. గాంధీజీ మానవుడు కాదు ఆయన ఓ శక్తి. తెల్లటి వస్త్రం, చెరగని చిరునవ్వు, చేతిలో కర్ర ఇది గాంధీ ఆహార్యం. అదే ఇప్పుడు బ్రాండ్ గా మారింది. ఇప్పుడు వరల్డ్ లో ఆయన ఓ ఇమేజ్ . సత్యం , అహింస అనే దాని మీద గాంధీ పోరాడారు. చివరి దాకా నిలిచే ఉన్నారు. దేశానికి స్వేచ్ఛను ప్రసాదించిన ఈ మహోన్నత మానవుడిని గాడ్సే అనే అహింసా వాది కాళ్లకు మొక్కి తుపాకీతో కాల్చాడు. గాంధీ హే రామ్ అంటూ ప్రాణాలు వదిలాడు.ఈ దేశం కొన్ని తరాలు, యుగాల పాటు స్ఫూర్తి కలిగించిన మహాత్ముడిని కోల్పోయింది. ఓ మహాత్మా ఓ మహర్షి అనుకుంటూ కోట్లాది ప్రజలు కన్నీళ్లతో జ్ఞాపకం చేసుకుంటున్నారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

స్మార్ట్ మొబైల్స్ లో షాన్ దార్ షావోమి

Sat Sep 28 , 2019
Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email Pin it http://www.janavahinitv.com/2019/09/blog-post_630/#cmVkbWkuanBn భారతీయ మార్కెట్ ను చైనాకు చెందిన మొబైల్స్ కంపెనీల ఫోన్స్ దుమ్ము రేపుతున్నాయి. ఇప్పటికే దిగ్గజ కంపెనీలైన యాపిల్, శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్ హవాను లెనోవా, వివో, ఒప్పో , షావోమి మొబైల్స్ డామినేట్ చేసే స్థాయికి చేరుకున్నాయి. రోజుకో కొత్త ఫీచర్స్ , డిజైన్స్ తో […]