రియ‌ల్లీ రియ‌ల్ హీరో – రెడ్డి గెలుపు గాథ

రియ‌ల్ ఎస్టేట్ రంగం ఇండియాలో రాకెట్ కంటే వేగంగా విస్తరిస్తోంది. రాహుల్ యాద‌వ్ హౌజింగ్. కామ్ తో కోట్లు కొల్ల‌గొడితే హ‌నీ గ్రూప్ ఏకంగా రికార్డులు తిర‌గ రాస్తోంది. భూముల కొనుగోలు మంద‌గించినా ఇటీవ‌లి కాలంలో ప్లాట్లు, ఫ్లాట్స్, విల్లాలు, అపార్ట్ మెంట్లు, ఇండిపెండెంట్ హౌజెస్ కు విప‌రీత‌మైన డిమాండ్ నెల‌కొంది. బెంగ‌ళూరు, చెన్నై, హైద‌రాబాద్ ,కోల్ క‌త , ఢిల్లీ న‌గ‌రాల‌న్నీ రియ‌ల్ రంగంలో ముందంజలో ఉండేందుకు పోటీ ప‌డుతున్నాయి. ఏదైనా కొనుగోలు చేయాలంటే చాలా ఇబ్బందులు. ఎక్క‌డో ఉద్యోగం. వ‌చ్చిన జీతాల‌తో న‌మ్మ‌క‌మైన పెట్టుబ‌డి పెట్ట‌డం.
స‌రైన దానిని ఎంచు కోవాలంటే క‌ష్టంగా మారింది. బ్రోక‌ర్లు ఎక్కువై పోయారు. తీసుకున్న స్థ‌లం కానీ ఇల్లు కానీ ఫ్లాట్ కానీ స‌రైందో కాదోన‌న్న అనుమానం నెల‌కొన‌డం స‌హ‌జం. డ‌బ్బులు ఇచ్చినా త‌ప్ప‌ని తిప్ప‌లు ఎన్నో. వీటిలో ఏ ఒక్క‌టి కావాల‌నుకున్నా ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయాల్సిందే. టైం, డ‌బ్బులు పోతాయి. నిర్మాణ‌, రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌ల‌న్నీ ఒకే చోట అందుబాటులో ఉంటే ఎలా ఉంటుందో తెలియాలంటే హానీని సంద‌ర్శిస్తే చాలు.
జ‌స్ట్ హానీ గ్రూపులో లాగిన్ అయితే చాలు. ఒకే చోట అన్ని ర‌కాల ప్రాప‌ర్టీలు అందుబాటులోకి వ‌స్తాయి. అంతేకాదు సైట్ విజిట్ నుండి లీగ‌ల్, వాల్యూయేష‌న్, రిజిస్ట్రేష‌న్, డాక్యుమెంటేష‌న్, బ్యాంకు లోన్స్ అన్నీ ల‌భిస్తాయి. దీని బాధ్య‌త అంతా హానీ గ్రూప్ చూసుకుంటుంది. దీనిని ఓబుల్ రెడ్డి స్థాపించారు. సిఇఓగా ఎండీగా ఉన్నారు. 230 నిర్మాణ సంస్థ‌లు, 360 ప్రాజెక్టుల‌తో ఒప్పందం చేసుకున్నారు. 310 మంది ఉద్యోగులు ఈ కంపెనీలో ప‌నిచేస్తున్నారు.
ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌, కర్ణాట‌క రాష్ట్రాల‌లో రియ‌ల్ ఎస్టేట్ రెగ్యూలేట‌రీ అథారిటీ – రెరా తో హానీ గుర్తింపు పొందింది. ప్రొఫెష‌న‌ల్ గా నే విక్ర‌యిస్తుందీ ఈ సంస్థ‌. వ‌చ్చే ఆరు నెల‌ల్లో గ‌చ్చిబౌళి, సికింద్రాబాద్, విజ‌య‌న‌గ‌రం, అన‌కాప‌ల్లి, రాజ‌మండ్రి, కాకినాడ‌, విజ‌య‌వాడ‌, గుంటూరు, తిరుప‌తి, భువ‌నేశ్వ‌ర్, చెన్నై, బెంగ‌ళూరు, సౌత్, ఈస్ట్, సెంట్ర‌ల్ ప్రాంతాల్లో కొత్త బ్రాంచీల‌ను ఏర్పాటు చేయ‌బోతోంది హానీ గ్రూప్.
ప్ర‌స్తుతం పూర్వాంక‌ర‌, ప్రెస్టిజ్, ఎల్ అండ్ టీ, బిగ్రేడ్, లెగ‌సీ, ప్రావిడెంట్, సెంచురీ, గోద్రెజ్ , త‌దిత‌ర నిర్మాణ సంస్థ‌ల‌తో ఒప్పందం చేసుకుంది. ఇవ‌న్నీ క‌లిపి సుమారు 360 ప్రాజెక్టులు ఉన్నాయి. ల‌క్ష చ‌ద‌ర‌పు అడుగుల ఫ్లాట్స్ తో పాటు 10 వేల వ‌ర‌కు ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. హైద‌రాబాద్ లో నే 50 మంది డెవ‌ల‌ప‌ర్లు, 120 ప్రాజెక్టులు ఈ కంపెనీతో టై అప్ అయి ఉన్నాయి. దీని వ‌ల్ల డెవ‌ల‌ప‌ర్ల‌కు కొంత మేర లాభం వ‌స్తుంది. ఈ కంపెనీ త్వ‌ర‌గా విక్ర‌యించి పెడుతుంది. కొనుగోలుదారుల‌కు ఎలాంటి భ‌యం ఉండ‌దు. ఏజెంట్లు ఉండ‌రిక్క‌డ‌. అంతా కంపెనీ ఉద్యోగులే ఉండ‌డం దీని ప్ర‌త్యేక‌త‌. దీంతో అస‌లు ధ‌ర‌కే ల‌భిస్తాయి అన్నీ.
వైజాగ్ కేంద్రంగా ప్రారంభ‌మైన ఈ హ‌నీ కంపెనీ లో 9 మంది ఉండ‌గా ఇపుడు 300 మందికి పైగా ప‌ని చేస్తున్నారు. వ‌చ్చే ఏడాది మ‌రో 1000 మందికి పైగా ఉండ‌నున్నారు. పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌రం అన్ని కంపెనీలు, సంస్థ‌ల్లో ప‌ని చేస్తున్న వారిని తొల‌గిస్తే..ఈ కంపెనీ మాత్రం అద‌నంగా కొత్త వారిని తీసుకోవ‌డం విశేషం. ఈ సంస్త‌లో ఇప్ప‌టికే 2 వేల మంది క‌ష్ట‌మ‌ర్లుగా న‌మోదు చేసుకున్నారు.
వీళ్ల‌ల్లో 90 శాతానికి పైగా గృహ వినియోగ‌దారులే. స్వంతంగా రెండు ప్రాజెక్టులు స్టార్ట్ చేసిందీ ఈ సంస్థ‌. 4 వేల గ‌జాల్లో వీటి నిర్మాణం జ‌రుగుతోంది. గ‌త ఏడాది మూడున్న‌ర కోట్ల ట‌ర్నోవ‌ర్ సాధించింది. ఇపుడు రాబోయే ఏడాదిలో 5 కోట్ల‌ను టార్గెట్ పెట్టుకుంది. ఇటీవ‌ల కొత్త‌గా యాపిల్ పేరుతో ఇంటిరియ‌ర్ కంపెనీని స్టార్ట్ చేశారు ఓబుల్ రెడ్డి. వార్డ్ రోబ్స్ , మాడ్యూల‌ర్ కిచెన్స్, టీవీ యూనిట్స్ త‌యారు చేసేందుకు ప్లాంట్ ను కూడా ప్రారంభించారు.
చిన్న‌గా ప్రారంభ‌మైన హానీ గ్రూప్ ఇపుడు దేశ‌మంత‌టా విస్త‌రించేందుకు రెడీ అవుతోంది. దీని వెనుక అకుంఠిత‌మైన శ్ర‌మ దాగి ఉంది. ఈ విజ‌యం రెడ్డిదే. ఏదైనా న‌మ్మ‌కంతో ప‌నిని ప్రారంభిస్తే చాల‌దు దానికి అదృష్టం , క‌ష్టం తోడు కావాలంటారు ఆయ‌న‌. వ్యాపార‌మంటే డ‌బ్బులు పోగేసు కోవ‌డం కాదు..స‌మాజానికి తిరిగి ఇవ్వ‌డం అంటున్న రెడ్డి నిజంగా అభినంద‌నీయుడు క‌దూ.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

గోపీనాథ్..వ్య‌క్తి కాదు వ్య‌వ‌స్థ - అసాధార‌ణ‌మైన గాథ‌

Thu Jan 24 , 2019
Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email Pin it http://www.janavahinitv.com/2019/01/blog-post_93-7/#Z29waW5hdGguanB గాలిమోటార్లు ఎక్కాల‌ని ఎవ‌రికి ఉండ‌దు. బిజినెస్ ప‌ర్స‌నాలిటీస్, పొలిటిక‌ల్ లీడ‌ర్స్, కంపెనీల ఛైర్మ‌న్లు, సిఇఓలు, ఎండీలు, సినీ, స్పోర్ట్స్ స్టార్స్ ఇలా ఎంద‌రో ప్ర‌తి రోజూ విమానాల‌లో ప్ర‌యాణం చేయ‌డం మామూలే. మ‌రి మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లకు కూడా ఆశ‌లుండ‌వా. దానినే నిజం చేసిన ఘ‌న‌త మ‌న గోపీనాథ్ […]