సాధార‌ణ మ‌హిళ‌లు..అసాధార‌ణ విజ‌యాలు – మ‌హిళా శ‌క్తికి నిద‌ర్శ‌నం

దేశాభివృద్ధిలో మ‌హిళ‌ల‌దే కీల‌క భూమిక‌. వాళ్ల భాగ‌స్వామ్యం లేకుండా ఏ రంగం ముందుకు వెళ్ల‌లేని ప‌రిస్థితి. రాజ‌కీయ‌, సామాజిక‌, ఆర్థిక‌, సాంకేతిక‌, సాంస్కృతిక‌, టెలికాం, వ్యాపార రంగాల‌లో దూసుకెళుతున్నారు. స్వంతంగా త‌మ కాళ్ల మీద నిల‌బ‌డేందుకు య‌త్నిస్తున్నారు. న్యూ ట్రెండ్స్ తో ..న్యూ టెక్నాల‌జీతో డిఫ‌రెంట్ ఐడియాస్‌తో కంపెనీల‌ను స‌క్సెస్ ఫుల్ గా నిర్వ‌హిస్తున్నారు. ఇండియా వ్యాప్తంగా వుమెన్స్ బెస్ట్ ఆంట్ర‌ప్రెన్యూర్స్ గా రాణిస్తున్నారు. బీబా బ్రాండ్ గుర్తుందా..ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ రెడీమేడ్ డ్రెస్సెస్‌కు పేరున్న కంపెనీ. దీని వ్య‌వ‌స్థాప‌కురాలు మీనా బింద్రా. ఢిల్లీ కేంద్రంగా కంపెనీగా ఎదిగింది. చిన్న‌ప్పుడే తండ్రిని పోగొట్టుకుంది. నావ‌ల్ ఆఫీస‌ర్‌ను పెళ్లి చేసుకుంది. లోక‌ల్ గా దొరికే వాటితోనే ముంబ‌యిలో ఏకంగా స్టోరే ఓపెన్ చేసింది. మెల మెల్ల‌గా పుంజుకుంది. న‌గ‌ర‌మంత‌టా అవుట్ లెట్స్ ఓపెన్ చేసింది. ప్ర‌తి చోటా మేనేజ‌ర్లు, అసిస్టెంట్ మేనేజ‌ర్స్, సేల్స్ సిబ్బందిని అపాయింట్ చేసింది. ఇపుడు ట‌ర్నోవ‌ర్ కోట్ల‌కు చేరింది.
మంజూ భాటియా మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ వుమెన్. ఒక‌ప్పుడు రిసెప్ష‌నిస్ట్ గా పనిచేసిన ఈమె ఏకంగా వ‌సూలీ కంపెనీని స్టార్ట్ చేసింది. ఇండోర్ బిజినెస్ ఫ్యామిలీలో జ‌న్మించింది. ఫార్మా కంపెనీలో జాబ్ చేసింది. బ్యాంక్ డిఫాల్ట‌ర్స్ నుండి డ‌బ్బులు వ‌సూలు చేయ‌డం ఈమె ప‌ని. పురుషాధిక్య స‌మాజంలో ..రుణాలు వ‌సూలు చేయ‌డం మామూలు ప‌నా..కానీ మంజూ చేసి చూపించింది. పొలైట్ గా మాట్లాడ‌టం..లోన్స్ రిక‌వ‌రీ చేసి రికార్డు సృష్టించింది. అంతేనా ఇండియాను షేక్ చేస్తున్న పాన్ ఇండియా కంపెనీని స్థాపించింది. ఆమె కింద ఎందరో ప‌ని చేస్తున్నారు.
చిల్డ్ర‌న్స్ కు ఇష్ట‌మైన ఫుడ్ ఏదంటే ఏం చెబుతాం. ర‌జ‌నీ బెక్టార్ గురించి తెలుసు కోవాల్సిందే. క‌రాచీలో పుట్టింది. ఫ్యామిలీతో ఢిల్లీకి వ‌చ్చింది. త‌న పిల్ల‌లు బోర్డింగ్ స్కూల్‌కు పంపించేది. పిల్ల‌ల‌కు రెడీగా ఫుడ్ కావాలి. దీనిని గ‌మ‌నించింది. ఇంకేం క్రెమికా పేరుతో ఫుడ్ కంపెనీని ఏర్పాటు చేసింది. మెక్‌డోనాల్డ్ కంపెనీ ఏకంగా దీనిని కొనేసింది. ఇది ఆమెకు ద‌క్కిన గౌర‌వం క‌దూ. వివం ఆగ్రో టెక్ కంపెనీని నిర్మ‌ల కందాల్ గావోంక‌ర్ స్థాపించారు. బ‌యో గ్యాస్ ప్రాజెక్టుల‌ను గ్రామీణ ప్రాంతాల‌లో ఏర్పాటు చేసింది. ఇందుకోసం ప్ర‌భుత్వం అవార్డు ప్ర‌క‌టించింది.
స్వాన్ సూట్స్ పేరుతో కంపెనీని రంజ‌నా నాయ‌క్ స్థాపించారు. అపార్ట్ మెంట్స్‌ల‌లో స‌ర్వీస్ సెక్టార్‌ను ప్రొవైడ్ చేస్తుంది. ఐఎస్‌బీ కంపెనీని ఆమె చేసిన రిసెర్చ్ ను యాక్సెప్ట్ చేసింది. ఇది ఆమె సాధించిన ఘ‌న‌త‌. పాట‌రీ ఆర్ట్ పేరుతో కంపెనీని ప్రారంభించింది లీలా బోర్డియా. కోల్‌క‌తా కు చెందిన ఫ్యామిలీ. పాట‌రీ ఆర్టిజ‌న్స్ కు ఆదుకుంది ఆమె. వీరు చేసిన వ‌స్తువుల‌ను ఫ్రాన్స్, మెక్సికోలో అమ్మేలా చేసింది. చైనాలో గ్వాంగో గునాయి గార్మెంట్స్ ను ఏర్పాటు చేసింది హ‌న్ క్వీ హువా . 48 ఏళ్లుంటే న‌డిచేందుకు ఇబ్బంది ప‌డ‌తాం. కానీ జంష‌డ్ పూర్ కు చెందిన ప్రేమ‌ల‌తా అగ‌ర్వాల్ ఏకంగా ఎవ‌రెస్ట్ ప‌ర్వ‌తాన్ని అధిరోహించారు. రికార్డు బ్రేక్ చేశారు. పారు జ‌య‌క్రిష్ణ . అసాహి సాంగ్ వ‌న్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేసింది.
అహ్మ‌దాబాద్ లోని జైన్ ఫ్యామిలీకి చెందింది. ట్రావెల్ అండ్ క‌న్ స్ట్ర‌క్ష‌న్ కంపెనీలో చేరింది. కెమిక‌ల్స్ వాడ‌కుండా డై బిజినెస్ స్టార్ట్ చేసింది. కొరియ‌న్, జ‌ప‌నీస్, తైవానీస్ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. చెన్నైకి చెందిన ప‌ట్రిసియా నారాయ‌ణ్ 19 ఏళ్ల‌ప్పుడే పెళ్లి చేసుకుంది. భ‌ర్త వేధింపుల‌ను భ‌రించింది. పారిశ్రామిక‌వేత్త‌గా ఎదిగింది. ఫిక్కీ అవార్డును ద‌క్కించుకుంది. కోల్‌క‌తాకు చెందిన సుదేష్మా బెన‌ర్జీ ఆటో క్యాడ్ లో ఎక్స్ ప‌ర్ట్ గా ఎదిగింది. ఏకంగా దీని పేరు మీదే ట్రైనింగ్ కంపెనీని స్థాపించింది. ఒకే ఒక్క ఫిమేల్. అంతా మేల్సే. శ్రీ‌లంక‌, దుబాయి, ఆస్ట్రేలియా దేశాల నుండి ప్రాజెక్టుల‌ను ద‌క్కించుకుంది. త‌న‌ను తాను నిరూపించుకుంది ఈమె.
అహ్మ‌దాబాద్ లోని ఆంట్ర‌ప్రెన్యూర్స్ ఫ్యామిలీకి చెందిన వ్య‌క్తి జాసూ శిల్పి. గ్వాలీయ‌ర్ లోని ఝాన్సీ రాణి విగ్ర‌హాన్ని చూసింది. ఇన్ స్పైర్ అయింది. ముస్లిం ఆర్టిస్ట్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. విగ్ర‌హాల ఏర్పాటుకు సంబంధించి ప్ర‌భుత్వం నుంచి టెండ‌ర్లు ద‌క్కించుకుంది. శివాజీ, హ‌నుమాన్ ల విగ్ర‌హాల‌ను గుజ‌రాత్ స్టేట్ అంతా ఏర్పాటు చేసింది. ఇదో రికార్డు. ఇపుడు ఆమె ప‌నితీరుకు మెంచి అమెరికా నుండి ఆర్డ‌ర్స్ వ‌స్తున్నాయి. ఇదీ ఆమెకు ద‌క్కిన గుర్తింపు. కైరా ఇండియాను షేక్ చేసిన కంపెనీ. దీనిని దీపాలి సికంద్ స్థాపించింది. ఐటీ కంపెనీలు జ‌పం చేస్తున్న కంపెనీ ఇదే. అస్సాంలో మోస్ట్ స‌క్సెస్ ఫుల్ స్టార్ట‌ప్ పాన్సీ ఎక్స్‌పోర్ట్స్. దీనిని బినాపానీ తాలూకా దార్ ఏర్పాటు చేసింది. హ్యాండీ క్రాఫ్ట్స్ ఎక్స్ పోర్ట్ కంపెనీ ద్వారా ఆదాయం గ‌డించింది. సౌతాఫ్రికా, బ్రెజిల్ దేశాల‌కు పంపిస్తోంది.
ఎలా భ‌ట్. సూర‌త్‌లో పేరొందిన పేరు. సేవా పేరుతో సంస్థ‌ను ఏర్పాటు చేసింది. ఇందులో 1.7 మిలియ‌న్ల మ‌హిళ‌లను భాగ‌స్వాముల‌ను చేసింది. టెక్స్ టైల్ లేబ‌ర్ అసోసియేష‌న్ లో జాయిన్ అయింది. అంత‌ర్జాతీయంగా కార్మికుల స‌మ‌స్య‌ల గురించి నిల‌దీసింది. ద‌ళిత రిజ‌ర్వేష‌న్ ఇష్యూ మీద పోరాడింది. స‌హ‌కార వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసింది. మైక్రో ఫైనాన్స్ ద్వారా మ‌హిళ‌ల‌ను ఆదుకుంది. ఏకంగా మెగెసెస్ అవార్డు పొందింది. దీంతో పాటు ప‌ద్మ‌శ్రీ‌, ప‌ద్మ భూష‌ణ్ అవార్డు ద‌క్కించుకుంది. షోనాక్విప్ కంపెనీని స్థాపించింది షోనా మెక్ డోనాల్డ్. విక‌లాంగుల కోసం స్పెష‌ల్ గా వీల్ చెయిర్ ను త‌యారు చేసింది. సోష‌ల్ ప‌ర్ప‌స్ కింద మోస్ట్ పాపుల‌ర్ గా నిలిచింది. బిగిట్ అంటే ముంబ‌యిలో మోస్ట్ పాపుల‌ర్ రిటైల్ బ్రాండ్ గా ఎదిగింది. దీనిని లాంచ్ చేసింది నీనా లేఖి. ఆమె చేసిన ప్ర‌య‌త్నాన్ని మైకేల్ జాక్స‌న్ ఇన్ స్పైర్ అయ్యారు. పేప‌ర్ మేడ్ బ్యాగ్స్ తో కోట్లు సంపాదించే స్థాయికి చేరుకుంది.
సంగీత ప‌త్ని. ఈఆర్పీ సాఫ్ట్ వేర్‌ను డెవ‌ల‌ప్ చేసింది. నాగ్‌పూర్‌కు చెందిన ఈమె బిట్స్ పిలానిలో చ‌దువుకుంది. హెచ్ ఎల్ ఎల్, ఐష‌ర్ కంపెనీలలో ప‌నిచేసింది. ఎక్సెటెన్ష‌న్ సాఫ్ట్ వేర్ ను రూపొందించింది. బెంగ‌ళూరుకు షిప్ట్ అయ్యింది. అక్క‌డే ఉంటోంది. ఎంకె ఫార్మా అంటే ఇండియాలో నోటెడ్ ఫార్మా కంపెనీలలో ఒక‌టి. దీనిని స్తాపించింది స‌త్య వ‌డ్ల‌మాని. ఐఐటీ ముంబ‌యి లో చ‌దివింది. 2008లో దీనిని ప్రారంభించింది. ఇపుడు కోట్లు కురిపిస్తోంది. శిఖా శ‌ర్మ‌. ఈ పేరు ఇండియాలో నోటెడ్. న్యూట్రి హెల్త్ కంపెనీని ఏర్పాటు చేసింది.
ఏకంగా ప్రైమ్ మినిస్ట‌ర్ ను క‌లిసేలా చేసింది. దీపా సోమ‌న్. లుమీరే బిజినెస్ సొల్యూష‌న్స్ కంపెనీ ఓన‌ర్. ముంబ‌యిలోని హెచ్ ఎల్ ఎల్‌లో ప‌నిచేసింది. ఐటీలో కూడా ప‌ని చేసింది. ఐటీ వ‌ర‌ల్డ్ లో ఆమె ఇపుడు ఓ ఐకాన్. పూణేలో క్రాయోన్ పిక్చ‌ర్స్ పేరుతో త్రీడీ యానిమేష‌న్ స్టూడియోను ఏర్పాటు చేసింది న‌మ్ర‌తా శ‌ర్మ‌. కాంటెస్ట్ 2 విన్ కంపెనీ సీఇఓ అలోక్ కేజ్రివాల్ న‌మ్ర‌త కంపెనీకి స‌పోర్ట్ గా నిలిచాడు. 36 రంగ్ పేరు ఢిల్లీలో సుప‌రిచితం. ఛ‌త్తీస్ గ‌ఢ్ లోని బ్రైబ‌ల్ ఆర్ట్స్‌ను డెవ‌ల‌ప్ చేసింది నితీ తాహ్. పాండిచ్చేరికి చెందిన అమీనా పీజేపీ ఇండ‌స్ట్రీస్ కంపెనీని ప్రారంభించింది. మ‌స్కిటో ఆయిల్ ప్రాడ‌క్ట్స్‌ను త‌యారు చేస్తుంది ఈ కంపెనీ. వీళ్లు సాధార‌ణ మ‌హిళ‌లు..అసాధార‌ణ‌మైన విజ‌యాలు స్వంతం చేసుకున్నారు.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

వేటివ్ ఐడియాస్..దే..హ‌వా

Thu Jan 24 , 2019
Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email Pin it http://www.janavahinitv.com/2019/01/blog-post_90-6/#SVQuanBn ఇన్నోవేటివ్ ..క్రియేటివిటీకి పెద్ద పీట వేస్తోంది బెంగ‌ళూరు ఐటీ రంగం. ఎక్క‌డ లేని విధంగా క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ప్ర‌తిభ క‌లిగిన వారిని గుర్తించి..గౌర‌వించి..ప్రోత్స‌హిస్తోంది. అందుకే ఇపుడా న‌గ‌రానికి ఎక్క‌డ‌లేని డిమాండ్. యుఎస్ , జ‌పాన్, సింగ‌పూర్, ఫ్రాన్స్, యుకె, బ్యాంకాక్, త‌దిత‌ర కంట్రీస్ అన్నీ ఇటు వైపు […]