గోపీనాథ్..వ్య‌క్తి కాదు వ్య‌వ‌స్థ – అసాధార‌ణ‌మైన గాథ‌

గాలిమోటార్లు ఎక్కాల‌ని ఎవ‌రికి ఉండ‌దు. బిజినెస్ ప‌ర్స‌నాలిటీస్, పొలిటిక‌ల్ లీడ‌ర్స్, కంపెనీల ఛైర్మ‌న్లు, సిఇఓలు, ఎండీలు, సినీ, స్పోర్ట్స్ స్టార్స్ ఇలా ఎంద‌రో ప్ర‌తి రోజూ విమానాల‌లో ప్ర‌యాణం చేయ‌డం మామూలే. మ‌రి మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లకు కూడా ఆశ‌లుండ‌వా. దానినే నిజం చేసిన ఘ‌న‌త మ‌న గోపీనాథ్ దే. ఇండియాలో మోస్ట్ స‌క్సెస్ ఫుల్ ప‌ర్స‌న్‌గా ఏవియేష‌న్ రంగంలో ఆయ‌న‌కో చ‌రిత్ర ఉంది. ఈ కెప్టెన్ ఏది చేసినా అది స‌క్సెసే. ప్ర‌స్తుత ప్ర‌పంచ మార్కెట్ కు అనుగుణంగా త‌న పంథాను మార్చుకుంటూ గెలుపు లోని మ‌జాను ఆస్వాదిస్తున్నారు ఆయ‌న‌. ఈ కెప్టెన్ డిఫ‌రెంట్ . ఎన్నో ఎత్తు ప‌ల్లాల‌ను చ‌వి చూశారు.
పాల రైతుగా, సెరిక‌ల్చ‌ర్ క‌న్స‌ల్టెంట్ గా, కోళ్ల వ్యాపారిగా, హోట‌ల్ ఓన‌ర్ గా, ఎన్ ఫీల్డ్ బైక్ డీల‌ర్ గా, స్టాక్ బ్రోక‌ర్ గా, ఏవియేష‌న్ ఆంట్ర‌ప్రెన్యూర్ గా, రాజ‌కీయ నాయ‌కుడిగా, కాల‌మిస్ట్ గా , రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ గా ..కార్గో రంగంలో లాజిస్టిక్ వ్యాపారిగా ఇన్ని రంగాల‌లో అనుభ‌వం గ‌డించారు. 66 ఏళ్ల వ‌య‌స్సున్న ఆయ‌న ఇప్ప‌టికీ యంగ‌ర్స్ తో పోటీ ప‌డుతున్నారు. దేనికైనా సై అంటున్నారు. ఏ రంగంలోనైనా ఇట్టే దూరిపోయి..కొత్త దారుల‌ను త‌యారు చేసే కెపాసిటీ ఆయ‌న‌కు మాత్ర‌మే స్వంతం. ఇదీ ఆయ‌న స్పెషాలిటీ.
గొరూర్ రామ‌స్వామి అయ్యంగార్ గోపినాథ్ 13 న‌వంబ‌ర్ 1951లో క‌ర్ణాట‌క‌లోని హ‌స్స‌న్ జిల్లా గొరూర్ గ్రామంలో పుట్టారు. ఎనిమిది మంది సంతానంలో ఆయ‌న రెండో వారు. క‌ర్ణాట‌క మీడియం స్కూల్‌లో 5 వ త‌ర‌గ‌తిలో నేరుగా చేరాఉ. 1962లో ప‌రీక్ష రాసి నేరుగా మిల‌ట‌రీ స్కూల్‌కు ఎంపిక‌య్యాడు. నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడెమీలో చేరాడు. ఇండియ‌న్ మిలిట‌రీ అసోసియేష‌న్‌కు సెలెక్టు అయ్యాడు. ఈ కోర్సు పూర్త‌య్యాక ఇండియ‌న్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ లోకి ఎంట‌ర‌య్యాడు.
ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఐఎంఏ నుండి ప‌ట్టా పొందారు. 8 ఏళ్ల పాటు స‌ర్వీసులు అందించాక 1979లో కెప్టెన్ గా రిటైర్ అయ్యారు. 1971లో ఇండియా బంగ్లాదేశ్ యుద్ధ రంగంలో పాల్గొన్నారు. ఆయ‌న‌కు వ్య‌వ‌సాయం అంటే మ‌క్కువ‌. రైతుగా , సెరిక‌ల్చ‌ర్ స్పెష‌లిస్ట్ గా పేరొందారు. 1996లో రోలెక్స్ లారేట్ అవార్డు పొందారు. మ‌లంద్ మోటార్స్ ను ప్రారంభించారు. ఎన్ ఫీల్డ్ బైక్ షోరూం తెరిచారు. 1969లో హ‌స‌న్ లో ఓ హోట‌ల్ కొనుగోలు చేశారు. ఆగ్రో ఎంట‌ర్ ప్రైజెస్ ను లాభాల బాట ప‌ట్టించాడు.
గ్రామీణ ప్రాంతాల‌కు చెందిన రైతుల‌ను క‌ల‌స్తూ వ‌చ్చారు. వేలాది మంది రైతుల‌ను కూడ‌గ‌ట్టారు. ఒక స‌హ‌కార వ్య‌వస్థ‌ను ఏర్పాటు చేశాడు. బెంగ‌ళూరులో స్థిర‌ప‌డ్డారు. త‌న స్నేహితుడు జె. సెమోల్ తో క‌లిసి డెక్క‌న్ ఏవియేష‌న్‌ను 1996లో స్థాపించాడు. దేశం గ‌ర్వించేలా త‌న ఆధ్వ‌ర్యంలోని కంపెనీ మొద‌టి సారి అన్ని ప్రాంతాల‌కు విమానాల‌ను న‌డిపించ‌గ‌లిగాడు. ఇదో రికార్డుగా మిగిలి పోయింది.
చార్టెడ్ హెలికాప్ట‌ర్ స‌ర్వీసెస్ ను మొద‌ట‌గా అందించారు. వీఐపీలు, వీవీఐపీల‌కు అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో ఏవియేష‌న్ స‌ర్వీస‌స్‌ను ప్రొవైడ్ చేయ‌డం. ఇండియా,శ్రీ‌లంక‌కు సేవ‌లందించారు. చార్టెడ్ హెలికాప్ట‌ర్ స‌ర్వీసెస్‌ను మ‌ధ్య‌త‌ర‌గతి ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాల‌నే సంక‌ల్పంతో స‌క్సెస్ అయ్యారు గోపీనాథ్. సెకండ్ ఏవియేష‌న్ వెంచ‌ర్ స్టార్ట్ చేశాడు..అదే ఎయిర్ ద‌క్క‌న్. 2003లో ఇది రూపు దిద్దుకుంది. మాసెస్‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. త‌క్కువ ధ‌ర‌లు..ఎక్కువ వ‌స‌తులతో దీనిని నిర్వ‌హించారు.
కామ‌న్ మ్యాన్ ను కూడా చేరింది. ఇండియ‌న్ ఏవియేష‌న్ రంగంలో 22 శాతం వాటాను ఎయిర్ ద‌క్క‌న్ చేజిక్కించుకుంది. ఇది ఓ రికార్డు. 43 ఎయిర్ క్రాఫ్ట్స్, 350 విమానాల‌తో ఈ సంస్థ ఎదిగింది. 2007లో విమాన‌యాన రంగంలో సంక్షోభం ఏర్ప‌డింది. దీని దెబ్బ‌కు ఎయిర్ ద‌క్క‌న్ భారీ న‌ష్టాల‌ను చ‌వి చూసింది. దీంతో గోపీనాథ్ విజ‌య్ మాల్యాకు అమ్మేశాడు. అదే కింగ్ ఫిష‌ర్ ఎయిర్ లైన్స్ గా ప్ర‌సిద్ధి చెందింది. ఆ త‌ర్వాత దానిపై నిషేధం విధించింది భార‌త ప్ర‌భుత్వం.
అంత‌టితో ఆగాడా గోపీనాథ్. లాజిస్టిక్ రంగంలోకి ఎంట‌ర్ అయ్యాడు. కొత్త వెంచ‌ర్ ను స్టార్ట్ చేశాడు. అదే ద‌క్క‌న్ 360. ఎయిర్ కార్గో స‌ర్వీస్ . టైర్ 1, టైర్ 2 సిటీస్ ను క‌లుపుతూ ఈ స‌ర్వీసెస్ న‌డుస్తుంది. ద‌క్క‌న్ కార్గో అండ్ ఎక్స్ ప్రెస్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రారంభించాడు. 2007-2008లో ప‌బ్లిక్ ఇంట‌రెస్ట్ లిటిగేష‌న్ రావ‌డంతో క‌ర్ణాట‌క కోర్టు ఆపేసింది. రాజ‌కీయాల్లోకి ఎంట‌ర్ అయ్యాడు. 2009లో ఇండిపెండెంట్ గా లోక్ స‌భ‌కు పోటీ చేశాడు. 2014లో ఆమ్ ఆద్మీ పార్టీ నుండి నిల‌బ‌డ్డాడు. ఎన్నో గెలుపులు అందుకున్న ఈ కెప్టెన్ ఇక్క‌డ గెల‌వ‌లేక పోయాడు.
ఒక వ్య‌క్తి ఇన్ని రంగాల‌లో రాణించ‌డం బహుషా ఆయ‌న‌కే చెల్లింది. అందుకే గోపీనాథ్ కు ఎన్నో అవార్డులు ద‌క్కాయి. 1996లో రోలెక్స్ , 2005లో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం రాజ్యోత్స‌వ పుర‌స్కారం ప్ర‌క‌టించింది. 2007లో ఫ్రాన్స్ ప్ర‌భుత్వం నైట్ అవార్డును ప్ర‌క‌టించింది. క‌ర్ణాట‌క ఫిక్కీ విశ్వేశ్వ‌ర‌య్య మెమోరియ‌ల్ అవార్డును, రామ‌స్వామి అయ్యంగార్ లిట‌రీరీ అవార్డును అందుకున్నారు. మ‌నిషి అన్నాక ప్ర‌య‌త్నం చేస్తూనే ఉండాలంటారు గోపీనాథ్. ఐ నెవ్వ‌ర్ అగ్రీ ఫెయిల్యూర్ అంటారు ఈ కెప్టెన్.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

50 పైస‌ల పెట్టుబ‌డి 2 ల‌క్ష‌ల రాబ‌డి - ఓ మ‌హిళ క‌థ‌

Thu Jan 24 , 2019
Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email Pin it http://www.janavahinitv.com/2019/01/blog-post_86-7/#aWRlYS5qcGc= ఐడియా వ‌ర్క‌వుట్ అవుతుందా. ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుందా. ఎవ‌రైనా ఉద్యోగం ఇస్తే ..నెల నెలా జీతం వ‌స్తే. ఫ్యామిలీకి స‌రిపోతే ..జీవితం హాయిగా గ‌డిచిపోతే చాల‌నుకునే కుటుంబాలు ఈ దేశంలో కోట్ల‌ల్లో ఉన్నాయి. కానీ ఆమె మాత్రం అంద‌రికంటే భిన్నంగా ఆలోచించింది. చెన్నైలో సందీపా అంటే చిన్న పిల్లాడిని […]