వేటివ్ ఐడియాస్..దే..హ‌వా


ఇన్నోవేటివ్ ..క్రియేటివిటీకి పెద్ద పీట వేస్తోంది బెంగ‌ళూరు ఐటీ రంగం. ఎక్క‌డ లేని విధంగా క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ప్ర‌తిభ క‌లిగిన వారిని గుర్తించి..గౌర‌వించి..ప్రోత్స‌హిస్తోంది. అందుకే ఇపుడా న‌గ‌రానికి ఎక్క‌డ‌లేని డిమాండ్. యుఎస్ , జ‌పాన్, సింగ‌పూర్, ఫ్రాన్స్, యుకె, బ్యాంకాక్, త‌దిత‌ర కంట్రీస్ అన్నీ ఇటు వైపు చూస్తున్నాయి. 25 ఏళ్ల లోపు యువ‌తీ యువ‌కులు కొత్తగా అంకురాల వైపు దృష్టి సారించారు. ఇక్క‌డే కేంద్రంగా ఏర్పాటైన ప‌లు స్టార్ట‌ప్‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు సంపాదించాయి. ఇది ఇక్క‌డి వారి ప్ర‌తిభ‌. ఇపుడు ఎవ‌రైనా క‌ష్ట‌ప‌డ‌తారు. కానీ అంద‌రికంటే భిన్నంగా ఆలోచించి..ఆచ‌ర‌ణ‌లోకి తీసుకు వ‌స్తేనే క‌దా ఆశించిన ప‌లితాలు వ‌స్తాయి అంటారు..టెక్కీలు.

హ‌ర్ష‌వ‌ర్ద‌న్ లునియా , ముకుల్ స‌చ‌న్ లు కో ఫౌండ‌ర్లుగా ఏర్పాటు చేసిన లెండింగ్ కార్ట్ స్టార్ట‌ప్ త‌క్కువ టైంలోనే ఎక్కువ ఆద‌ర‌ణ పొందింది. మోస్ట్ ఫేవ‌ర‌బుల్ స్టార్ట‌ప్‌గా పేరు తెచ్చుకుంది. జ‌న‌వ‌రి 2014లో దీనిని ప్రారంభించారు. ఎవ్వ‌రి సిఫార‌సు అక్క‌ర్లేదు. ఇంకెవ్వ‌రినీ దేబ‌రించాల్సిన ప‌నిలేదు. పొలిటిక‌ల్ లీడ‌ర్లు, బ్రోక‌ర్ల‌ను ఆశ్ర‌యించాల్సిన ప‌నిలేదు. బ్యాంక‌ర్ల చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఉన్న‌ద‌ల్లా మీ మీద మీకు న‌మ్మ‌కం. మీరు ప్రారంభించ‌బోయే స్టార్ట‌ప్ లేదా కంపెనీ, ఎంట‌ర్ ప్రైజెస్ లేదా స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డేది ఏదైనా స‌రే లెండింగ్ కార్ట్ ను సంప్ర‌దిస్తే చాలు.

జ‌స్ట్ వారం రోజుల్లో మీకు కావాల్సిన పెట్టుబ‌డి స‌మ‌కూరుతుంది. అందుకే లెండింగ్ కార్ట్ అని పేరు పెట్టారు. త‌క్కువ వ‌డ్డీ ..ఎక్కువ లాభం దీని ముఖ్య ఉద్దేశం. కొద్ది మొత్తంగా పెట్టుబ‌డితో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఇపుడు ఇండియాలో అప్పులు ఇవ్వ‌డంలో టాప్ వ‌న్ కంపెనీగా పేరు తెచ్చుకుంది. దిన‌దినాభివృద్ధి సాధిస్తున్న లెండింగ్ కార్డ్ కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు ఏకంగా 25 కోట్ల రూపాయ‌లు అప్పుగా ఇచ్చింది. 2018 పూర్త‌య్యే లోపు దేశ మంత‌టా విస్త‌రించేలా ప్లాన్ చేశారు హ‌ర్ష‌వ‌ర్ద‌న్. మీకు అప్పు కావాలంటే ఎంచ‌క్కా మంచి ప్రాజెక్టుతో లెండింగ్ కార్ట్ ను సంప్ర‌దించండి చాలు.

ఇనిటో ఇదో బ్యూటిఫుల్ స్టార్ట‌ప్. గ‌ర్భం దాల్చ‌టం అంటే మ‌రో జ‌న్మ ఎత్త‌టం లాంటిది. ప్ర‌తి మ‌హిళ‌కు ఎదుర‌య్యే పెద్ద స‌మ‌స్య‌. క‌డుపులో ఉన్న బిడ్డ స‌క్ర‌మంగా ఉందో లేదోన‌న్న ఆందోళ‌న గ‌ర్భ‌వ‌తుల్లో ఎక్కువ‌గా ఉంటుంది. ఐఐటీ రూర్కీ, ఐఐటీ చెన్నైల‌కు చెందిన ఆయుష్ రాయ్, వ‌రుణ్‌లు క‌లిసి బెంగ‌ళూరు కేంద్రంగా ఇనిటో పేరుతో స్టార్ట‌ప్ రాశారు. గ‌ర్భం దాల్చిన మొద‌టి వారం నుండి కాన్పు అయ్యే దాకా పిండం క‌ద‌లిక‌లు, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, మందులు, డాక్ట‌ర్ల ప్రిస్క్రిప్ష‌న్స్ , ఎలా వాడాలో కూడా ఇందులో ఉంటాయి.

అన్నీ ద‌గ్గ‌రుండి అందజేసేలా చేస్తుంది ఈ కంపెనీ. ఆస్ప‌త్రుల‌కు వెళ్లాలంటే పెద్ద ఖ‌ర్చు. టైం వేస్ట్. ఆ టెస్టులు ఈ టెస్టులంటూ విప‌రీత‌మైన డ‌బ్బులు చెల్లించ‌డం. వీట‌న్నింటిని దృష్టిలో పెట్టుకుని డాక్ట‌ర్లు, మందులు, వ‌స‌తులతో క‌లిపి స్టార్ట‌ప్ గా తీర్చిదిద్దారు వీరు. ఇది కూడా మంచి పేరు తెచ్చుకుంది. న‌వంబ‌ర్ 2017లో యుఎస్ కు చెందిన ఇన్వెస్ట‌ర్స్ ఒన్ మిలియ‌న్ డాల‌ర్ల‌ను పెట్టుబ‌డిగా పెట్టారు.

స్ప్రింగ్ బోర్డు స్టార్టింగ్‌లోనే స‌క్సెస్ బాట ప‌ట్టింది. ఇది బెంగ‌ళూరు కేంద్రంగా స్టార్ట‌ప్‌గా ప్రారంభ‌మైంది. దీనిని గౌతం తాంబే, పారుల్ గుప్తాలు స్థాపించారు. ఆన్ లైన్ లో విద్య‌ను బోధిస్తారు. దీని ద్వారా ఖ‌ర్చు త‌క్కువ‌..ఎక్కువ అనుభ‌వాన్ని పొందుతారు. దీని ద్వారా కోర్సులు నిర్వ‌హిస్తారు. బిల్డింగ్ క‌న్ స్ట్ర‌క్ష‌న్, బిజినెస్ అండ్ ఆంట్రప్రెన్యూర్ షిప్, ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్, హాస్పిటాలిటీ, ఫుడ్ అండ్ బేవ‌ర్జీస్, ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ క‌మ్యూనికేష‌న్ టెక్నాల‌జీ, అడ్వాన్స్ డ్ మాన్యూఫాక్ష‌రింగ్, మార్కెటింగ్, లాంగ్వేజెస్ అండ్ క‌మ్యూనికేష‌న్ కోర్సుల‌ను ఎంచ‌క్కా ఆన్ లైన్ లో నేర్చుకోవ‌చ్చు.

విద్యార్థుల‌తో పాటు ప‌ని చేస్తున్న ప్రొఫెష‌నల్స్ కూడా నేర్చుకోవ‌చ్చు. వీటి ద్వారా కోర్సులు పూర్తి చేసుకున్న వారు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన కంపెనీల‌లో ఉద్యోగాలు ద‌క్కించుకున్నారు. ఐబీఎం, ఫేస్ బుక్, గూగుల్, కోకో కోలా, మైక్రోసాఫ్ట్, హెచ్‌సీఎల్ ,లాంటి కంపెనీలలో కొలువు తీరారు. స్ప్రింగ్ బోర్డు ద్వారా ఉద్యోగాలు పొందిన వారు 80 శాతానికి పైగా ఉండ‌డంతో ఈ స్టార్ట‌ప్‌కు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఇపుడు స్టూడెంట్స్, వ‌ర్కింగ్ ప్రొఫెష‌న‌ల్స్ కు మంచి వేదిక‌గా ఏర్ప‌డింది. పెట్టుబ‌డులు భారీగా వ‌స్తున్నాయి.

స్థ‌లాలు, ఆస్తులు ఉండి రుణాలు దొర‌క‌ని వారికి స్వ‌ర్గ‌ధామంగా వినుతికెక్కింది బెంగ‌ళూరు బేస్డ్ స్టార్ట‌ప్ కేపిట‌ల్ ఫ్లోట్ కంపెనీ. శశాంక్ రిష్య‌శ్రింగ‌, గౌర‌వ్ హిందూజా దీనిని స్థాపించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ..క‌ఠిన‌త‌ర‌మైన నిబంధ‌న‌లు లేకుండానే కాగితాలు పెట్టుకుంటారు. త‌క్కువ వ‌డ్డీకి రుణాలు అంద‌జేస్తుంది కేపిట‌ల్ ఫ్లోట్. త‌క్కువ టైంలోనే రుణాలు అంద‌జేస్తూ రికార్డు బ్రేక్ చేసింది. ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ అమెరిక‌న్ కంపెనీ అమెజాన్ ఈ స్టార్ట‌ప్ తో టై అప్ చేసుకుందంటే దీని స‌క్సెస్ రేట్ ఏ విధంగా అర్థం చేసుకోవ‌చ్చు.

దీని ద్వారా ఇఎంఐల సౌక‌ర్యం కూడా ఏర్పాటు చేసింది. టీవీలు, ఎల్‌సీడీలు, రిఫ్రిజిరేట‌ర్స్, ఏసీ, కాట్, ఫ్యాన్, టేబుల్ లాంటివ‌న్నీ ఈజీగా ఫ్లోట్ ద్వారా పొందుతున్నారు. కొద్దిపాటి డ‌బ్బుల‌తో ప్రారంభ‌మైన కేపిట‌ల్ ఫ్లోట్ కంపెనీలో అమెజాన్ ఊహించ‌ని రీతిలో ఇన్వెస్ట్ చేసింది. ఒక‌టా రెండా ఏకంగా 293 కోట్ల‌ను పెట్టుబ‌డి పెట్టేందుకు ఎంఓయు కుదుర్చుకుంది.

బెంగ‌ళూరు కేంద్రంగా స్టార్ట్ అయిన మ‌రో స్టార్ట‌ప్ డాక్స్ యాప్. ఫాస్రోజ్ టెక్నాల‌జీస్ ప్రైవేట్ లిమిటెడ్ దీనిని రూపొందించింది. వంద‌లాది మంది డాక్ట‌ర్లు ఇందులో 24 గంట‌ల పాటు అందుబాటులో ఉంటారు. త‌క్కువ ఖ‌ర్చు..ఎక్కువ ఉప‌యోగం ఉండేలా ఇది కంపెనీగా ఎదిగింది. రోగులు..డాక్ట‌ర్ల మ‌ధ్య ఇది అనుసంధాన క‌ర్త‌గా ఉంటుంది.

క్ష‌ణాల్లో రోగుల‌కు సంబంధించిన వివ‌రాలు న‌మోదు చేస్తారు. వాటి ఆధారంగా డాక్ట‌ర్లు టెస్ట్‌లు , ట్రీట్ మెంట్ దీని ద్వారా నిర్వ‌హిస్తుంది. ఈ స్టార్ట‌ప్ ఇపుడు రోగుల‌కు, డాక్ట‌ర్ల‌కు గ్రేట్ ఫ్లాట్ ఫాంను ఏర్పాటు చేసింది. ఇపుడు పెట్టుబ‌డులు పెద్ద క‌ష్టం కాదంటోంది ఈ సంస్థ‌. ఇండియా అంత‌టా విస్త‌రించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

డిఫ‌రెంట్ ఐడియా కోట్ల‌ను కురిపిస్తోందంటే న‌మ్మ‌గ‌ల‌మా. ఇది నిజం. అదే ఫ‌ర్లెంకో స్టార్ట‌ప్. పెద్ద పెద్ద భ‌వంతులు, ఫంక్ష‌న్లకు వెళితే మ‌న క‌ళ్ల‌కు ముందుగా క‌నిపించేది అంద‌మైన ఫ‌ర్నీచ‌ర్. మ‌రి దానిని స్వంతం చేసుకోవాల‌ని అనుకుంటాం. వాటి ధ‌ర‌లు కొండెక్కి ఉంటాయి. ఇలాంటి వాటిని అద్దెకు తీసుకుంటే ఎలా ఉంటుంది..ఇదే ఆలోచ‌న అజిత్ క‌రింపానాకు వ‌చ్చింది. 2011లో చిన్న‌గా స్టార్ట‌ప్ గా ప్రారంభించాడు.

స‌బ్ స్క్రిప్ష‌న్ బేసిస్ కింద వీటిని రెంట్‌కు ఇచ్చేలా చేశాడు. అదృష్టం త‌న్నుకు వ‌స్తుంటే ఎవరు కాద‌న‌గ‌ల‌రు. బాలీవుడ్ బిగ్ స్టార్ అమీర్ ఖాన్ ఇందులో పెట్టుబ‌డి పెట్టాడు. 3 ల‌క్ష‌ల యుఎస్ డాల‌ర్ల‌ను పెట్టుబ‌డి పెట్టాడు. ఇదో రికార్డుగా నిలిచింది. దీంతో బెంగ‌ళూరు తో పాటు డిల్లీ, ముంబ‌యి, పూణేల‌లో స్టార్ట్ చేసేందుకు అజిత్ ప్లాన్ చేసుకున్నారు.

కార్పొరేట్ కంపెనీల‌లో ప‌నిచేసే ఉద్యోగుల‌కు ట్రావెల్ మేనేజ్ మెంట్ సొల్యూష‌న్స్ ను అంద‌జేసేలా ఏర్పాటైందే ఇటిలైట్ స్టార్ట‌ప్. ఇది బెంగ‌ళూరు కేంద్రంగా ప్రారంభ‌మైంది. దీనిని మ‌యాంక్ , అనీష్ ఖాడియా ఏర్పాటు చేశారు. వీసీ ఫ‌ర్మ్స్, మాట్రిక్స్ పార్ట్‌నర్స్ ఇందులో పెట్టుబ‌డి పెట్టారు. కాస్ట్ ఎఫెక్టివ్ ను త‌గ్గించేందుకు ఏర్పాటైన స్టార్ట‌ప్ క్వొబోల్. 2011లో జాయ్ దీప్ సేన్ శ‌ర్మ‌, ఆషిస్ తుష్కో దీనిని ఏర్పాటు చేశారు. బిగ్ డేటా స‌ర్వీసెస్ అంద‌జేస్తుంది ఈ సంస్థ‌.

కొద్ది స‌మ‌యంలోనే ఎక్కువ ఆద‌ర‌ణ పొందింది. బెంగ‌ళూరు, చెన్నై, హైద‌రాబాద్, ఢిల్లీ, ముంబ‌యి న‌గ‌రాలకు విస్త‌రించింది. తినే ప‌దార్థాలు, కూర‌గాయ‌లు మందులు లేకుండా ఉండేలా ఏర్పాటైంది కార్బ‌న్ లైట్స్ స్టార్ట‌ప్. 2012లో కెవిన్ హోస్ట‌న్, సోమ్ నారాయ‌ణ్ స్థాపించారు. బెంగ‌ళూరు, చెన్నై ల‌లో సేవ‌లందిస్తోంది. ఇపుడు ఇండియా అంత‌టా ఏర్పాటు చేయాల‌ని అనుకుంటోంది. వెబ్ సైట్, యాప్‌ల క్రియేష‌న్ చేయ‌డంలో డిఫ‌రెన్సియేష‌న్ క‌నిపించేలా చేస్తోంది నికి.ఏయ్ స్టార్ట‌ప్.

ఇది బెంగ‌ళూరు కేంద్రంగా ప‌నిచేస్తోంది. జైస్వాల్, కేశ‌వ్ ప్రవాసి, నితిన్ బాబెల్, శిషిర్ మోడీ దీనిని స్థాపించారు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్సీను ఏర్పాటు చేస్తుంది. ఊబెర్, ఓలా, ఓయో, గ్రోఫెర్స్, బిగ్ బాజార్, రెడ్ బ‌స్, డొమినోస్, ట్రివాగో, ఇబిబో, ఈజీ డిన్న‌ర్, భార‌త్ గ్యాస్ త‌దిత‌ర కంపెనీల‌న్నీ నికి క‌ష్ట‌మ‌ర్లే. దీనిలో పెట్టుబ‌డి పెట్టేందుకు భారీ కంపెనీలు క్యూ క‌ట్టాయి. మొత్తం మీద స్టార్ట‌ప్ కంపెనీలు త‌మ ఉనికిని కాపాడుకుంటూనే కోట్లాది రూపాయ‌ల‌తో కొలువులు సృష్టిస్తున్నాయి. అందుకే బెంగ‌ళూరు ఐటీ కి కేరాఫ్‌గా నిలిచింది.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

టాప్ ఫైవ్‌లో హైద‌రాబాద్ బెస్ట్ -రిచెస్ట్ సిటీగా బ్రాండ్ నేమ్

Thu Jan 24 , 2019
Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email 29వ కొత్త రాష్ట్రంగా ఏర్ప‌డిన తెలంగాణ రాష్ట్రం దేశానికే గ‌ర్వ‌కార‌ణంగా నిలుస్తోంది. ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, పారిశ్రామిక ప‌రంగా, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ , టెలికాం, ఫార్మా , లాజిస్టిక్, ఈ కామ‌ర్స్ బిజినెస్‌, త‌దిత‌ర రంగాల‌లో త‌న‌దైన ముద్రతో ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకుంటోంది. కేపిట‌ల్ సిటిగా ఉన్న భాగ్య‌న‌గ‌రం అన్ని ప్రాంతాల […]