ఎన్ఐటీలో టాప్ కాలేజీలు ఇవే

దేశంలో ఇంజ‌నీరింగ్ విద్య‌కున్నంత డిమాండ్ ఇంకే కోర్సుకు లేదంటే అతిశ‌యోక్తి కాదేమో. నారాయ‌ణ‌, శ్రీ‌చైత‌న్య‌, గౌత‌మి, ఎక్సెల్ అకాడెమీ ..ఇలా ప్ర‌తి కాలేజీలతో పాటు ప్ర‌భుత్వ కాలేజీల విద్యార్థుల భ‌విష్య‌త్‌ను నిర్ణ‌యించే జేఇఇ మెయిన్స్ ఎగ్జామ్ పూర్త‌యింది. దేశ వ్యాప్తంగా 9 ల‌క్ష‌ల‌కు పైగా స్టూడెంట్స్ ఈ ప‌రీక్ష‌ను రాశారు. తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వారే ఎక్కువ‌గా దీనిని ఎంచుకున్నారు. గ‌త ప‌దేళ్ల నుండి ఈ కాలేజీల‌కు విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది. ప్ర‌పంచ వ్యాప్తంగా పేరొందిన కంపెనీల‌న్నీ ఈ కాలేజీల‌కు క్యూ క‌ట్ట‌డం కూడా కార‌ణం కావ‌చ్చు. బెస్ట్ ఫ్యాక‌ల్టీ తో పాటు గుడ్ ఎన్విరాన్ మెంట్ ఉండ‌డం ..ప‌క్కా ప్లేస్ మెంట్ రావ‌డం అన్న‌ది గ్యారెంటీ కావ‌డంతో ఎక్క‌డ‌లేని డిమాండ్ ఉంటోంది ఈ కాలేజీల‌కు. ఇండియాలో ఇంజ‌నీరింగ్ స్ట‌డీస్ అంటే ఫ‌స్ట్ ప్రిఫ‌రెన్స్ ఇచ్చేది మాత్రం ఐఐటీ కాలేజీల‌కే. ఐఐటీ ఢిల్లీ, ముంబ‌యి, ఖ‌ర‌గ్ పూర్, చెన్నై ఉన్నాయి. ఆ త‌ర్వాత నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ ( ఎన్ ఐ టీ ) కాలేజీల‌ను ఎంచుకుంటున్నారు. ప్రైవేట్ ఇంజ‌నీరింగ్ కాలేజీలు కూడా టాప్ లేవ‌ల్‌లో ఉంటున్నాయి.
అందులో వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీతో పాటు ఎస్ ఎస్ ఆర్ ఇంజ‌నీరింగ్ కాలేజీ కూడా ఉంది. బిట్స్ పిలానీ కి విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. పెట్రోలియం కోర్సుల‌కు సంబంధించి డెహ్రాడూన్ కాలేజీ కి మంచి క్రేజ్ ఉంది. ఇక వీట‌న్నింటి కంటే ఎక్కువ‌గా డీమ్డ్ యూనివ‌ర్శిటీగా పేరు తెచ్చుకుంది క‌ళింగ యూనివ‌ర్శిటీ..దీని ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ఇంజ‌నీరింగ్ కోర్సుల‌కు ప్రాధాన్య‌త ఎక్కువ‌గా ఉంటోంది. సిస్ట‌మాటిక్ గా స్టూడెంట్స్‌ను భావి భార‌త ఇంజ‌నీర్లుగా తీర్చిదిద్ద‌డంలో ఎన్ ఐ టీ కాలేజీలు ముందంజ‌లో ఉంటున్నాయి. కేంద్ర , రాష్ట్ర ప్ర‌భుత్వాలు వీటిని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్నాయి. ప్ర‌పంచ కాలేజీలతో పోటీ ప‌డుతున్నాయి. దీంతో ఇత‌ర దేశాల‌కు చెందిన బ‌డా కంపెనీల‌న్నీ ఈ కాలేజీ క్యాంప‌స్‌ల‌కు హాజ‌ర‌వుతున్నాయి.
త‌మ‌కు కావాల్సిన వారిని ఎంచుకుంటున్నాయి. మ‌రికొన్ని మొద‌ట్లోనే స్టూడెంట్స్ ను ఎంపిక చేసుకుంటుండ‌గా మ‌రికొన్ని ఇంట‌ర్నిషిప్ కింద సెల‌క్టు చేసుకుంటున్నాయి. ఇక్క‌డంతా క్రియేటివిటీకి సంబంధించిన అంశం. ఇక ఐఐటీలు, ఎన్ ఐటీలు, ఐఐఐటి కాలేజీలలో ఈసారి సీట్లను కేంద్ర స‌ర్కార్ పెంచింది. ఈ కాలేజీల్లో చేరేందుకు భారీ పోటీ ఉంటోంది. తాజాగా జేఇఇ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన వారికి క‌టాఫ్ మార్క్‌లు ఏవిధంగా ఉంటాయ‌న్నదో తెలియ‌క విద్యార్థులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. మొత్తం మీద ఇంజ‌నీరింగ్ విద్య‌కు సంబంధించిన దేశంలో ఎన్నో ఎన్ ఐటీ కాలేజీలు ఉన్న‌ప్ప‌టికీ వాటిలో ప‌ది కాలేజీలు మాత్రం టాప్‌లో నిలిచాయి. వాటిని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూష‌న‌ల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వ‌ర్క్ ( ఎన్ ఐ ఆర్ ఎఫ్ ) ప్ర‌క‌టించింది.
బిఇ, బిటెక్ కోర్సుల‌లో జేఇఇ మెయిన్స్ లో టాప్ ర్యాంకుల‌ను సాధించిన స్టూడెంట్స్‌ను మాత్ర‌మే ఈ కాలేజీలు ఎంచుకుంటాయి. అందుకే య‌మ క్రేజీ వీటికి. ఈసారి నిర్వ‌హించిన జేఇఇ ప‌రీక్ష‌లో క‌టాఫ్ మార్కులు ఈ విధంగా ఉండ‌వ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు. కానీ ఇవే ప్రామాణికం కాద‌ని గ‌మ‌నించాలి. జ‌న‌ర‌ల్ కేట‌గిరీకి 115, ఓబీసీ 80 , ఎస్‌సీ 60 , ఎస్టీ 50 మార్కులు ఉండ‌వ‌చ్చ‌ని అంచ‌నా. మొత్తం మీద ప్ర‌క‌టించిన ప‌ది కాలేజీలలో ..త‌మిళ‌నాడులోని తిరుచ్చి లోని ఎన్ఐటీ కాలేజీ మొద‌టి స్థానంలో ఉండ‌గా ..ఒడిస్సాలోని రూర్కెలాలోని ఎన్ఐటీ రూర్కెలా కాలేజీ రెండో స్థానం సంపాదించింది. మూడో స్థానంలో క‌ర్ణాట‌క‌లోని మంగ‌ళూరు – సూర‌థ్క‌ల్ ఎన్ఐటీ కాలేజీ ఉండ‌గా ..నాలుగో స్థానంలో తెలంగాణ‌లోని వ‌రంగ‌ల్ ఎన్ ఐటీ నిలిచింది.
అయిదో స్థానంలో నాగ్‌పూర్ ఎన్ఐటీ కాలేజీ, ఆరో స్థానంలో హ‌ర్యానాలోని కురుక్షేత్ర ఎన్ఐటీ కాలేజీ ఉండ‌గా, ఏడో స్థానంలో వెస్ట్ బెంగాల్‌లోని దుర్గాపూర్ ఎన్ఐటీ కాలేజీ నిల‌వ‌గా..ఎనిమిదో స్థానంలో ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లోని అల‌హాబాద్‌కు చెందిన ఎంఎన్ ఐఐటీ కాలేజీ ఉండ‌గా..తొమ్మిదో స్థానంలో కేర‌ళ‌లోని కాలిక‌ట్ ఎన్ఐటీ కాలేజీ, ప‌దో స్థానంలో రాజ‌స్థానంలోని జైపూర్ ఎంఎన్ఐటీ కాలేజీలు ఉన్నాయి. సో జేఇఇ మెయిన్స్ రాసిన స్టూడెంట్స్ ..బాగా మార్కులు వ‌స్తాయ‌ని అనుకున్న వాళ్లు ఈ కాలేజీల‌ను ఎంచుకుంటే భ‌విష్య‌త్ బాగు ప‌డ‌టానికి..దిగ్గ‌జ కంపెనీల‌లో చేరేందుకు మార్గం సుగ‌మ‌మ‌వుతుంది. కాలేజీల‌ను ఎంచుకునేట‌ప్పుడు కొంచెం జాగ్ర‌త్త‌లు పాటిస్తే జీవితానికి మంచిది.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

అనిల్ క‌ష్టం ..హాస్యానందం..!

Thu Jan 24 , 2019
Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email ఎలాంటి జిమ్మిక్కులు లేకుండా ..ఎక్కువ ప్ర‌చారం లేకుండానే టాలీవుడ్‌లో రికార్డుల‌ను తిర‌గ రాస్తోంది ఎఫ్ 2. ఇదేమిటి సినిమా పేరేమిటి..ఇలా చిత్రంగా..విచిత్రంగా అనిపిస్తోంది అనుకుంటున్నారా..ఇదే డైరెక్ట‌ర్ ప్ర‌త్యేక‌త‌. జీవితం అన్నాక కాస్తంత భిన్నంగా ఉండొద్దు. ఎవ‌రో ఏదో చెబితే..దానినే ఫాలో అవుతూ అదే ప్ర‌పంచ‌మని మురిసి పోయే స‌న్నాసులున్న ఈ లోకంలో […]