అనిల్ క‌ష్టం ..హాస్యానందం..!

ఎలాంటి జిమ్మిక్కులు లేకుండా ..ఎక్కువ ప్ర‌చారం లేకుండానే టాలీవుడ్‌లో రికార్డుల‌ను తిర‌గ రాస్తోంది ఎఫ్ 2. ఇదేమిటి సినిమా పేరేమిటి..ఇలా చిత్రంగా..విచిత్రంగా అనిపిస్తోంది అనుకుంటున్నారా..ఇదే డైరెక్ట‌ర్ ప్ర‌త్యేక‌త‌. జీవితం అన్నాక కాస్తంత భిన్నంగా ఉండొద్దు. ఎవ‌రో ఏదో చెబితే..దానినే ఫాలో అవుతూ అదే ప్ర‌పంచ‌మని మురిసి పోయే స‌న్నాసులున్న ఈ లోకంలో కాస్తంత డిఫ‌రెంట్‌గా ఆలోచించ‌డం ఎంత బాగుంటుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. క‌న్నీళ్ల‌ను తాక‌కుండా ఏ ఒక్క‌రు గెలుపును సాధించారు క‌నుక‌. సాహిత్యం ప‌ట్ల ఎరుక ఉన్న వారే ఇవాళ ద‌ర్శ‌కులుగా రాణిస్తున్నారు. త‌మ‌దైన స్ట‌యిల్ తో దూసుకు వెళుతున్నారు. త‌లైవా న‌టించిన పేట‌, బాల‌కృష్ణ న‌టించిన క‌థానాయ‌కుడుతో పాటు ప‌లు సినిమాలు సంక్రాంతి కంటే ముందు త‌ర్వాత విడుద‌ల‌య్యాయి. వీటితో పాటు విక్ట‌రీ వెంక‌టేశ్, స‌హ‌జ న‌టుడు వ‌రుణ్ తేజ్ క‌లిసి న‌టించిన ఎఫ్ 2 హాస్యాన్ని పండిస్తూ కోట్లు వ‌సూలు చేస్తూ రికార్డులు తిర‌గ రాస్తోంది.
ఎప్పుడూ ఉన్న‌దేగా..ఇందులో ఉన్న‌ది. ఎంచ‌క్కా ఇంటిల్లిపాది క‌లిసి చూడాల్సిన సినిమా ఇది. సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ దాకా నవ్వులే న‌వ్వులు. చిన్న పాయింట్ తీసుకుని సినిమాలో వినోదాన్ని పండించాడు అనిల్ రావిపూడి. స్వ‌త‌హాగా క‌ళాత్మ‌క‌మైన హృదయం ఉన్న వ్య‌క్తి కాబ‌ట్టి సినిమాను చాలా ఈజీగా న‌డిపించాడు. క‌థ‌లో కానీ ..స్క్రీన్ ప్లే ..డైరెక్ష‌న్లో కానీ ఎక్క‌డా తొట్టుపాటు లేకుండా క‌డుపుబ్బా న‌వ్వించేందుకు ప్ర‌య‌త్నం చేశాడు. పృథ్వీ, ప్ర‌కాశ్ రాజ్, ప్ర‌గ‌తి, త‌దిత‌రులు అతిథి పాత్ర‌ల్లో అద్భుతంగా న‌టించారు. హీరోలు, హీరోయిన్లు ద‌ర్శ‌కుడి టేస్ట్ కు త‌గ్గ‌ట్టు పాత్ర‌లకు ప్రాణం పోశారు. నిర్మాత దిల్ రాజుకు ఈ ఏడాది ప్రారంభం మంచి శుభారంభాన్ని ఇచ్చింద‌నే చెప్పాలి. ఇటు టాలీవుడ్‌లో అటు అమెరికాలో ఎక్క‌డ చూసినా ఎఫ్ 2 సినిమా గురించిన చ‌ర్చ‌లే. హింసాత్మ‌కంగా సినిమాను తీయొచ్చు..అక్క‌ర‌కు రాని డైలాగ్‌ల‌తో నింపొచ్చు..కానీ అనిల్ లో క‌సి ఉంది..విజ‌యం సాధించాల‌న్న త‌ప‌న ఉంది. బ‌త‌క‌డంలో ఎదురైన క‌ష్టాలే హాస్యాన్ని పండిస్తాయి. అదే రావిపూడి చేశారు. స‌క్సెస్ అయ్యారు.
మిగ‌తా దిగ్గ‌జాల‌ను కాద‌ని కోట్లు కొల్ల‌గొట్టేలా తీర్చిదిద్దాడు ఈ సినిమాను. ఇంజ‌నీరింగ్ చ‌దివిన ఈ డైరెక్ట‌ర్ ప్ర‌కాశం జిల్లా చిలుకూరువారి పాలెం ఊరు. సినీ ర‌చ‌యిత‌గా రాణించారు. ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. అంత‌కు ముందు ప‌టాస్ తీశాడు. సుప్రీం, రాజా ది గ్రేట్ సినిమాల‌కు డైరెక్ష‌న్ చేశాడు. 
చిన్న‌త‌నంలో త‌ల్లిదండ్రులు పాల‌మూరు జిల్లా అమ‌ర‌వాయి ప్రాంతానికి వ‌చ్చి వ్య‌వ‌సాయం సాగు చేశారు. ప్రాథ‌మిక విద్యాభ్యాసం ఈ జిల్లాలోనే సాగింది. చిన్న‌ప్ప‌టి నుండి టెంట్ హాలులో కూర్చుని సినిమాలు చూశారు. తండ్రికి ఆర్టీసీలో ఉద్యోగం రావ‌డంతో తిరిగి స్వంత జిల్లాకు వెళ్లారు. ప‌దో త‌ర‌గ‌తి అద్దంకిలో ..ఇంట‌ర్ గుంటూరులో చ‌దివారు. వ‌డ్ల‌మూడిలో ఇంజ‌నీరింగ్ పూర్తి చేశారు. త‌న బాబాయి అరుణ్ ప్ర‌సాద్ కూడా సినీ ద‌ర్శ‌కుడు కావ‌డంతో ఈ రంగంపై ఆయ‌న‌కు మ‌క్కువ పెరిగింది. కుటుంబ స‌భ్యుల అనుమ‌తితో టాలీవుడ్‌లోకి ప్ర‌వేశించారు. బాగా చ‌దవ‌డం ..రాసే నేర్పు..నైపుణ్యం ఉండ‌డంతో సంభాష‌ణ‌ల ర‌చ‌యిత‌గా స‌క్సెస్ అయ్యాడు. 2008లో శౌర్యం సినిమాకు డైలాగ్స్ రాశాడు. 2009లో శంఖం సినిమాకు..2011లో కందిరీగ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీకి అనిల్ మాట‌లు రాశాడు. ఈ సినిమాకు ప్ర‌త్యేకంగా క‌థ‌ను స‌మ‌కూర్చాడు. 2012లో ద‌రువు సినిమాకు, సుడిగాడు మూవీకి సంభాష‌ణ‌లు రాశాడు. 2013లో మ‌సాలా సినిమాకు, 2014లో ఆగ‌డు సినిమాకు క‌థ‌, మాట‌లు రాశాడు.
2015లో స‌క్సెస్ ఫుల్ సినిమాగా పేరొందిన పండ‌గ చేస్కో మూవీకి క‌థ‌ను అందించాడు అనిల్. అపార‌మైన అనుభ‌వం సంపాదించ‌డంతో రావిపూడికి క‌ళ్యాణ్ రామ్ హీరోగా ప‌టాస్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఛాన్స్ ద‌క్కింది. అది మంచి టాక్ తెచ్చుకుంది. రెండో చిత్రం సాయి ధ‌ర‌మ్ తేజ్ తో సుప్రీం సినిమాకు డైరెక్ష‌న్ వ‌హించారు. రైజింగ్ స్టార్ ర‌వితేజతో తీసిన రాజా ది గ్రేట్ మూవీ బ్లాక్ బ్ల‌స్ట‌ర్ సినిమాగా నిలిచింది. తాజాగా ఎఫ్ 2 – ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్ పేరుతో వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్, మెహ్రీన్, త‌మ‌న్నా ల‌తో తీసిన ఈ సినిమా ఇపుడు వ‌సూళ్ల‌లో టాప్ వ‌న్ లో నిలుస్తోంది. ఎక్క‌డ చూసినా హిట్ టాక్ తెచ్చుకుంది. డైరెక్ట‌ర్ , నిర్మాత దిల్ రాజు, న‌టీ న‌టులు ఎవ‌రూ ఊహించ‌ని విజ‌యాన్ని స్వంతం చేసుకుని దూసుకెళుతోంది ఈ మూవీ. సాధించిన ఈ విజ‌యం అనిల్‌ను మ‌రో మెట్టు ఎక్కించింది. క‌థ‌లో ఈజ్..మ‌న మీద న‌మ్మ‌కం ఉంటే..కంటెంట్‌లో ద‌మ్ముంటే ఇంకేం సినిమా జ‌నాన్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తుంది. డ‌బ్బులు వచ్చేలా చేస్తుంది. రోటిన్ క‌థ‌ల‌కు భిన్నంగా కేవ‌లం ఒకే ఒక్క పాయింట్‌తో సినిమాను న‌డిపించిన ఘ‌న‌త రావిపూడిదే. ఇలాంటి సినిమా తీసినందుకు దిల్ రాజును అభినందించ‌కుండా ఉండ‌లేం. వీలైతే మీరూ చూడండి. కాస్తంత వినోదం..పెద‌వుల మీద చిరున‌వ్వు తొంగి చూస్తుంది.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

రియ‌ల్లీ రియ‌ల్ హీరో - రెడ్డి గెలుపు గాథ

Thu Jan 24 , 2019
Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email Pin it http://www.janavahinitv.com/2019/01/blog-post_30-7/#cmVkZHkuanBn రియ‌ల్ ఎస్టేట్ రంగం ఇండియాలో రాకెట్ కంటే వేగంగా విస్తరిస్తోంది. రాహుల్ యాద‌వ్ హౌజింగ్. కామ్ తో కోట్లు కొల్ల‌గొడితే హ‌నీ గ్రూప్ ఏకంగా రికార్డులు తిర‌గ రాస్తోంది. భూముల కొనుగోలు మంద‌గించినా ఇటీవ‌లి కాలంలో ప్లాట్లు, ఫ్లాట్స్, విల్లాలు, అపార్ట్ మెంట్లు, ఇండిపెండెంట్ హౌజెస్ కు […]