ఏపీ పాలిటిక్స్‌లో రాధా సంచ‌ల‌నం -కేఏ పాల్ పిలుపు – టీడీపీలో చేరుతార‌న్న బాబు


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల వేడి ఊపందుకుంటోంది. టీడీపీ, జ‌న‌సేన‌, వైసీపీలు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ప‌డుతున్నాయి. ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తూ గెలుపు త‌మ‌దేనంటూ ఆశ‌ల ప‌ల్ల‌కీల‌లో ఊరేగుతున్నారు. కాబోయే సీఎం ఎవ‌రు అవుతార‌నే దానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి. రాయ‌ల‌సీమ‌, ఆంధ్ర‌ల‌లో మూడు పార్టీల మ‌ధ్యే పోటీ ఉండ‌బోతోంద‌ని ఇక ఎవ‌రు ప‌వ‌ర్ లోకి వ‌స్తార‌నేది అంచ‌నాల‌కు అంద‌డం లేద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కుల భావ‌న‌. దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని టీడీపీ టార్గెట్ చేస్తోంది. తెలుగుదేశం క‌మ‌లం మ‌ధ్య ఉన్న బంధం కాస్తా తెగి పోవ‌డంతో బాబు రాహుల్ గాంధీతో జ‌త క‌ట్టారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తానని జ‌నం సాక్షిగా ప్ర‌క‌టించిన పీఎం మాట త‌ప్పారంటూ చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు.
బిజేపీయేత‌ర శ‌క్తుల‌ను ఒకేతాటి పైకి తీసుకు రావ‌డంలో ఆయ‌న నిమ‌గ్నమ‌య్యారు. మ‌మ‌తా బెన‌ర్జీ, అఖిలేష్ యాద‌వ్, అర‌వింద్ కేజ్రీవాల్, మాయావ‌తి, దేవెగౌడ‌, స్టాలిన్‌ల‌తో ఇప్ప‌టికే క‌లిశారు. వారిని ఒప్పించారు. మ‌రో వైపు ఏపీలో మ‌రోసారి ప‌వ‌ర్ లోకి రావాల‌నే టార్గెట్‌తో బాబు ఇప్ప‌టి నుంచే కారాచ‌ర‌ణ‌లోకి దిగారు. ఏయే నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎవ‌రెవ‌రికి బ‌లం ఉందో స‌ర్వేలు కూడా చేయించారు. గెలుపు గుర్రాల‌కే సీట్లు కేటాయించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందు కోసం ఏకంగా న‌మ్మ‌క‌మైన టీంను కూడా ఏర్పాటు చేశారు. త‌న‌ను న‌మ్మి పార్టీలోకి వ‌చ్చే వారికి ఆయ‌న సాద‌ర స్వాగ‌తం ప‌లుకుతున్నారు. ఇందులో భాగంగా బెజ‌వాడ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసుకున్న వంగ‌వీటి రాధాను టీడీపీలోకి వ‌చ్చేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. రెండు రోజుల్లో రాధా త‌న బ‌ల‌మైన వ‌ర్గంతో చేర‌నుండ‌డంతో ఏపీలో ఒక్క‌సారిగా రాజ‌కీయాలు మారిపోనున్నాయి.
బెంజ్ స‌ర్కిల్‌లో రాధాకు బిగ్ టీం ఉంది. ఇక్క‌డ ఎమ్మెల్యేగా ఉన్న బోండ ఉమ‌కు పార్టీ ప‌రంగా మంచి ప‌ద‌వి ఇస్తార‌ని ..ఇక్క‌డ రాధాకు టికెట్ ఇస్తే గెలుపున‌కు ఢోకా ఉండ‌ద‌ని అంచ‌నా. మొద‌ట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాధా వైసీపీలోకి వ‌చ్చారు. ఎమ్మెల్యే గా 2014లో పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. ప్ర‌స్తుతం ఆ పార్టీ నుండి టికెట్ క‌న్ ఫ‌ర్మ్ కాక పోవ‌డం..జ‌గ‌న్ ఒంటెద్దు పోక‌డ‌లు న‌చ్చ‌క పోవ‌డంతో ..ఇండిపెండెంట్ మ‌న‌స్త‌త్వం క‌లిగిన వంగ‌వీటి రాధా ఇముడ లేక పోయారు. రాధా అంటేనే ఓ బ్రాండ్. త‌న‌కంటూ న‌మ్మ‌క‌మైన వ‌ర్గం ఉంది. అంతేకాకుండా వేలాది మంది జ‌నం ఆయ‌న‌కు అభిమానులుగా ఉన్నారు. మోస్ట్ పాపుల‌ర్ లీడ‌ర్‌గా ఆయ‌న‌కు బెజ‌వాడ‌లో మంచి పేరుంది. ఒక్క‌సారిగా రాధా పార్టీని వీడుతున్నార‌నే స‌మాచారంతో వైసీపీ షాక్‌కు గురైంది. ప్ర‌జా సేవ‌కుడిగా..నాయ‌కుడిగా రాధా త‌క్కువ స‌మ‌యంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు.
లో ప్రొఫైల్ మెయింటెనెన్స్ చేసే రాధా ఏది మాట్లాడినా సంచ‌ల‌న‌మే. పార్టీలో ప‌వ‌ర్ ఫుల్ వ్య‌క్తిగా ఎదిగిన ఆయ‌న‌ను జ‌గ‌న్ ప‌ట్టించుకోవ‌డం మానేశార‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. ఇంకో వైపు టీడీపీలో కంటే జ‌న‌సేన పార్టీలో చేరితే బావుంటుంద‌న్న అభిప్రాయాన్ని కార్య‌క‌ర్త‌లు కొంద‌రు వ్య‌క్తం చేసినా..చివ‌ర‌కు అధికార పార్టీ టీడీపీలోకి వెళ్లేందుకే ఆయ‌న నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ త‌మ పార్టీలోకి రావాల‌ని రాధాను కోరారు. టికెట్ ఇవ్వ‌డంతో పాటు రాధాను గెలిపిస్తాన‌ని..ఆయ‌న ఏర్పాటు చేసిన ట్ర‌స్టుకు 100 కోట్ల రూపాయ‌లు ఇస్తాన‌ని పాల్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. దీనిపై రాధా స్పందించ‌లేదు. బ‌ల‌మైన నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు క‌లిగిన రాధా న‌డిచినా..మాట్లాడినా కొంచెంద ప్ర‌త్యేక‌త ఉంటుంది. వైఎస్ జగన్ టిక్కెట్లు అమ్ముకుంటున్నారని, అడిగినంత డబ్బులు ఇవ్వనందుకే రాధాకు టిక్కెట్ ఇవ్వలేదంటూ రాధా అనుచ‌రులు తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. . వచ్చే ఎన్నికల్లో రాధారంగా అభిమానులెవరూ వైసీపీకి ఓట్లేయవద్దంటూ పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నిక‌ల ప్ర‌చారంలో టీడీపీ త‌ర‌పున ప్ర‌చారం చేస్తారా లేక తానే ముందుండి న‌డిపిస్తారా అన్న‌ది వేచి చూడాల్సిందే.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

క‌భి క‌భీ మేరె దిల్ మే..!

Thu Jan 24 , 2019
Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email Pin it http://www.janavahinitv.com/2019/01/blog-pos-9/#a2FiaGlrYWJoaS5 ఏళ్లు గ‌డిచినా పాట‌ల్లోని మాధుర్యం త‌గ్గ‌డం లేదు. క‌భి క‌భీ సినిమా నేటికీ హృద‌యాల‌ను హ‌త్తుకుంటోంది. ల‌క్ష‌లాది మంది ఇంకా ఆ సినిమాలోని ప్ర‌తి పాటా గుండెకు తాళం వేసేదే. ఎన్ని సార్లు చూసినా వెంటాడుతూనే ఉంటుంది ఆ సినిమా. యాష్ చోప్రాకు ఓ ర‌కంగా రుణ‌ప‌డి […]