50 పైస‌ల పెట్టుబ‌డి 2 ల‌క్ష‌ల రాబ‌డి – ఓ మ‌హిళ క‌థ‌

1
ఐడియా వ‌ర్క‌వుట్ అవుతుందా. ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుందా. ఎవ‌రైనా ఉద్యోగం ఇస్తే ..నెల నెలా జీతం వ‌స్తే. ఫ్యామిలీకి స‌రిపోతే ..జీవితం హాయిగా గ‌డిచిపోతే చాల‌నుకునే కుటుంబాలు ఈ దేశంలో కోట్ల‌ల్లో ఉన్నాయి. కానీ ఆమె మాత్రం అంద‌రికంటే భిన్నంగా ఆలోచించింది. చెన్నైలో సందీపా అంటే చిన్న పిల్లాడిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. లైఫ్ లో ఒక్క‌సారే క‌దా ఉండేది..ఈ అవ‌కాశాన్ని ఎందుకు స‌ద్వినియోగం చేసుకోకూడ‌ద‌న్న న‌మ్మ‌క‌మే ఆమెను వ్యాపారం ప్రారంభించేలా చేసింది. ఇంకొక‌రైతే ఎందుకీ భారం మోయ‌టం. ఉన్న‌దాంట్లోనే సంతృప్తి చెందితే చాల‌న‌కుంటారు. అలా అయితే స‌క్సెస్ రాదు. ఉన్న చోట‌నే ఉండిపోతాం. ప‌ట్రిషా నారాయ‌ణ్ మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ ..స‌క్సెస్ ఫుల్ వుమెన్ ఇన్ ఇండియా. ఒక‌టా రెండా ఏకంగా 14 రెస్టారెంట్ల‌ను ఏర్పాటు చేసింది. 50 పైస‌లు పెట్ట‌బుడితో రోజుకు 2 ల‌క్ష‌ల రూపాయ‌లు ఆర్జిస్తోంది.
వీట‌న్నింటికి ఆమె య‌జ‌మాని. విలాస‌వంత‌మైన భ‌వ‌నం. తిరిగేందుకు కారు. 200 మంది ఉద్యోగుల‌కు ఆస‌రా క‌ల్పిస్తోంది సందీపా. ఇంత‌లా ఎద‌గ‌టానికి ఎన్నో అవ‌రోధాల‌ను అధిగ‌మించింది. మ‌రెన్నో క‌ష్టాల‌ను దాటింది. చెన్నైలో జ‌న్మించిన ఆమె త‌ల్లిదండ్రులు ఉద్యోగ‌స్తులే. ఇంట‌ర్ లో ఉన్న‌ప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకుంది. విష‌యం తెలుసుకున్న పేరెంట్స్ గెంటేశారు. ప్రేమించిన భ‌ర్త కు స‌వాలక్ష అవ‌ల‌క్ష‌ణాలు. తాగ‌డం ఆమెను కొట్ట‌డం రోజూ జ‌రిగేది.
గ‌త్యంత‌రం లేక త‌నింటికి వెళ్లింది. కూతురి ప‌రిస్థితిని చూసి తండ్రి చ‌లించి పోయాడు. ఆద‌రించాడు. ఇద్ద‌రు పిల్ల‌ల‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ష‌ట్రీషాకు వంట వండ‌డం అంటే ఇష్టం. చిన్న‌ప్ప‌టి నుంచి అన్నింటిని ఎలా వండాలో నేర్చుకుంది. అత్యంత రుచిక‌రంగా, నాణ్య‌త‌తో చేసేది. ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ప‌చ్చ‌ళ్లు, జామ్స్ త‌యారు చేసి..త‌ల్లితో ప‌ని చేసే ఉద్యోగుల‌కు పంపించింది. అలా ఆమె త‌యారు చేసిన వాటిని మిగ‌తా వారు ఎగ‌బ‌డి కొనుక్కునే వారు. దీనినే వ్యాపాకంగా మార్చుకుని వ్యాపారం చేసే స్థాయికి ఎదిగింది.
ఆమె తండ్రి స్నేహితుడు బుద్ధి మాంద్యం క‌లిగిన వారి కోసం ఓ సంస్థ‌ను ఏర్పాటు చేశాడు. వాళ్ల కు ఉపాది కోసం టీ, టిఫిన్ బ‌ళ్ల‌ను తెప్పించాడు. ఆమె ప‌రిస్థితిని చూసి త‌న వ‌ద్ద ఉన్న ఇద్ద‌రికి ఉపాధి క‌ల్పిస్తే బండి ఇస్తాన‌ని చెప్పాడు. వాళ్లిద్ద‌రికి రోజూ స‌ర్వ్ చేస్తూనే..బండి తీసుకుని మెరీనా బీచ్ ద‌గ్గ‌ర‌కు రోజూ వెళ్లేది. మొద‌టి రోజు ఒకే ఒక్క టీ అమ్మింది. ఆ రోజు సంపాద‌న 50 పైస‌లు. ఏడ్చింది..త‌ల్లి ఓదార్చింది..
ఒక్క‌టీ అమ్మావంటే నువ్వు స‌క్సెస్ అయిన‌ట్టే..వెళ్లు..ప్ర‌య‌త్నం చేయ‌మ‌ని భ‌రోసా ఇచ్చింది. స‌మోసాల‌ను చేర్చింది బండిలోకి. టీ, కాఫీల‌తో పాటు స్నాక్స్ కూడా ఉంచింది. ఆరోజు 700 రూపాయ‌లు వ‌చ్చాయి. 1982 నుంచి 2003 వ‌ర‌కు మెరీనా బీచ్‌లోనే అమ్మింది. ఉద‌యం 5 గంట‌ల నుండి రాత్రి 11 గంట‌ల దాకా అమ్మింది. 700 నుండి 25 వేల రూపాయ‌ల దాకా చేరుకుంది. బంద్ రోజుల్లో కూడా పట్రీషా బండికి విప‌రీత‌మైన ఆద‌ర‌ణ‌.
ఆమె వంట రుచి గురించి చెన్నైలో చాలా మందికి పాకింది. బ్యాంక్ ఆఫ్ మ‌దురై ఉద్యోగుల దాకా వెళ్లింది. అక్క‌డ క్యాంటీన్ నిర్వ‌హించే చాన్స్ కొట్టేసింది. 300 మందికి వండి వ‌డ్డించాలి. ఆ త‌ర్వాత నేష‌న‌ల్ పోర్ట్ మేనేజ్ మెంట్ ట్రైనింగ్ స్కూల్లో కాంట్రాక్టు ద‌క్కించుకుంది. అక్క‌డ ఏకంగా ఆమెకు క్వార్ట‌ర్ ఇచ్చారు. మొద‌టి నెల జీతం 80 వేలు. ఆ త‌ర్వాత ల‌క్ష‌కు చేరింది. కొంత కాలానికి సంగీత రెస్టారెంట్ గ్రూప్ ఒక యూనిట్ లో పార్ట్ న‌ర్ షిప్ ఆఫ‌ర్ చేసింది. బిడ్డ‌కు పెళ్లి చేసింది. కొడుకు త‌ల్లికి ఆస‌రాగా ఉన్నాడు. స్వంతంగా రెస్టారెంట్ ఓపెన్ చేస్తే బావుంటుంద‌ని స‌ల‌హా ఇచ్చాడు.
ఇదే స‌మ‌యంలో కూతురు, అల్లుడు రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోయాడు. కోలుకోలేని సంఘ‌ట‌న‌. మ‌నిషి కాలేక పోయింది. 2006లో కొడుకే సందీపా పేరుతో రెస్టారెంట్ తెరిచాడు. అంబులెన్స్ రాలేదు. ఈ నిర్ల‌క్ష్యాన్ని త‌ట్టుకోలేక ఏకంగా ఓ అంబులెన్స్ కొని న‌డుపుతోంది. ఇదంతా ఉచిత‌మే. త‌న వారిని త‌లుచుకుంటూ సేవ చేస్తోంది. సందీపా రెస్టారెంట్ త‌క్కువ టైంలో ఆల్ టైం రికార్డు బ్రేక్ చేసింది. ఏకంగా 14 రెస్టారెంట్ల‌ను ఓపెన్ చేసింది. ఇపుడు ఈ రెస్టారెంట్ల‌లో 200 మందికి పైగా ప‌నిచేస్తున్నారు. భ‌ద్ర‌మైన జీవితాల‌కు భ‌రోసా క‌ల్పిస్తోంది. ప‌ట్రీషా.
మ‌న‌కు కావాల్సిన‌వ‌న్నీ దొరుకుతాయి. ఈ రెస్టారెంట్ల‌లో. రుచికి ..శుచికి..నాణ్య‌త‌కు ఇక్క‌డ ప్రాధాన్య‌త ఉంటుంది. స‌ర‌స‌మైన ధ‌ర‌ల్లో అన్నీ ల‌భిస్తాయి. జీవితంలో స‌క్సెస్ కావాలంటే క‌ష్ట‌ప‌డాలి. అదొక్క‌టే మ‌న‌ల్ని గ‌మ్య‌తీరాలకు చేరుస్తుంది. క‌ష్టాలు న‌న్ను ప‌రీక్షించాయి. ఎదుర్కొని ధైర్యంగా నిల‌బ‌డ్డా. ఇపుడు నాతో పాటే ఎంద‌రో ప‌నిచేస్తున్నారు.
వారిని చూసిన‌ప్పుడ‌ల్లా నా వాళ్లు గుర్తుకు వ‌స్తారంటారు ప‌ట్రీషా నారాయ‌ణ్. గ‌మ్యం గొప్ప‌దై ఉండాల్సిన ప‌నిలేదు. చిన్న‌దైనా ప‌ర్వాలేదు. ప‌ది మందికి ప‌ట్టెడ‌న్నం పెట్టేలా ఉండాలి. స‌క్సెస్ త‌నంత‌ట తానే మ‌న ద‌రికి వ‌స్తుందంటారు. ఆమె సాధించిన విజ‌యాన్ని చూసి కేంద్ర ప్ర‌భుత్వం ఏకంగా బెస్ట్ ఆంట్ర‌ప్రెన్యూర్ గా ఎంపిక చేసి..స‌త్క‌రించింది.

admin

One thought on “50 పైస‌ల పెట్టుబ‌డి 2 ల‌క్ష‌ల రాబ‌డి – ఓ మ‌హిళ క‌థ‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

సాధార‌ణ మ‌హిళ‌లు..అసాధార‌ణ విజ‌యాలు - మ‌హిళా శ‌క్తికి నిద‌ర్శ‌నం

Thu Jan 24 , 2019
Share on Facebook Tweet it Share on Google Pin it Share it Email Pin it http://www.janavahinitv.com/2019/01/50-2/#d29tZW5zLmpwZw= దేశాభివృద్ధిలో మ‌హిళ‌ల‌దే కీల‌క భూమిక‌. వాళ్ల భాగ‌స్వామ్యం లేకుండా ఏ రంగం ముందుకు వెళ్ల‌లేని ప‌రిస్థితి. రాజ‌కీయ‌, సామాజిక‌, ఆర్థిక‌, సాంకేతిక‌, సాంస్కృతిక‌, టెలికాం, వ్యాపార రంగాల‌లో దూసుకెళుతున్నారు. స్వంతంగా త‌మ కాళ్ల మీద నిల‌బ‌డేందుకు య‌త్నిస్తున్నారు. న్యూ ట్రెండ్స్ తో ..న్యూ టెక్నాల‌జీతో డిఫ‌రెంట్ ఐడియాస్‌తో […]